SNP
Sanju Samson, Maheesh Theekshana, IND vs SL, Golden Duck: టీమిండియా యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ నెత్తిపై దరిద్రం మామూలుగా లేదు. లేకపోతే.. ఇలా జరగడమేంటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Sanju Samson, Maheesh Theekshana, IND vs SL, Golden Duck: టీమిండియా యంగ్ క్రికెటర్ సంజు శాంసన్ నెత్తిపై దరిద్రం మామూలుగా లేదు. లేకపోతే.. ఇలా జరగడమేంటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీమిండియాలో ఉన్నా లేకపోయినా.. కొన్ని ఏళ్ల నుంచి ఏ సిరీస్‌కు జట్టును ప్రకటించినా ట్రెండింగ్‌లో ఉండే పేరు సంజు శాంసన్. ఎప్పుడో 2015లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ.. క్రికెట్ అభిమానులు మండిపడేవారు. సంజు శాంసన్‌కు టీమిండియాకు ఎంపిక చేయాలని, అతన్ని ప్లేయింగ్‌లో ఆడించాలని.. కొంతమంది క్రికెట్ అభిమానులు అయితే ఏకంగా ధర్నాలు కూడా చేశారు. స్టేడియానికి టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ ఆడేందుకు వస్తున్న సమయంలో తమ నిరసనలు కూడా తెలియజేశారు. ఇక యంగ్ క్రికెట్ గురించి ఈ రేంజ్‌లో సపోర్ట్‌గా నిలవడం బహుషా భారత క్రికెట్‌లో మరే క్రికెటర్‌కు కూడా జరగలేదు.
ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లాంటి సీనియర్ స్టార్ ప్లేయర్లు టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడంతో.. యువ క్రికెటర్లకు టీమిండియాలో అవకాశం దక్కింది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు. ఈ ఎంపికతో క్రికెట్ అభిమానులు ఖుష్ అయ్యారు. కానీ, తొలి టీ20లో అతన్ని పక్కనపెట్టేశారు. మళ్లీ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు శాంసన్‌ను బెంచ్‌పై కూర్చోబెడతారంటూ విమర్శించారు. ఏడుగురు కెప్టెన్లు మారినా సంజు తలరాత మారలేదంటూ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే రెండో టీ20లో శుబ్‌మన్ గిల్‌ను పక్కనపెట్టి.. సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ప్లేయింగ్‌లోకి తీసుకున్నారు. హమ్మయ్యా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు అని క్రికెట్ అభిమానులు సంతోష పడేలోపే.. సంజు శాంసన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అది కూడా క్లీన్ బౌల్డ్. దెబ్బకు సంజు శాంసన్ హృదయాలు ముక్కలు అయ్యాయి. అసలే ఛాన్సులు రావడం లేదని బాధడుతున్న సమయంలో అవకాశం వచ్చిన మ్యాచ్‌లో ఇలా అవుటైతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టీ20లో లంక బౌలర్ మహీష్ తీక్షణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే.. తీక్షణ వేసిన ఆ బంతి అన్‌ప్లేయబుల్ డెలవరీ అంటూ క్రికెట్ నిపుణులు అంటున్నారు. అంత మంది బాల్ సంజు శాంసన్‌కే పడాలా.. మరీ ఇంత దరిద్రం ఏంటయ్యా నీకు అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇలా అయితే.. చివరి టీ20 తర్వాత సంజు శాంసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సర్దుకోవడమే అంటున్నారు. ఎందుకంటే.. కొత్త కుర్రాళ్లు అదరగొడుతున్నారు. మరి రెండో టీ20లో సంజు శాంసన్ గోల్డెన్ డక్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Golden duck for Sanju Samson. pic.twitter.com/avdrquZnxr
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 28, 2024