ఇలా ఆడితే.. ఇంకేం సపోర్ట్‌ చేస్తాం! సంజు శాంసన్‌ ఇక షెడ్డుకేనా?

సంజు శాంసన్‌.. టాలెంట్‌కు కొదవేలని క్రికెటర్‌. ఐపీఎల్‌లో అతి పిన్న వయసులోఏ హేమాహేమీలున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టును చాలా కాలంగా కెప్టెన్‌గా నడిపిస్తున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అందరితో ప్రశంసలు అందుకున్న యువ క్రికెటర్‌. అతని గురించి ఎవరు మాట్లాడినా.. భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా చెప్పుకునే వారు. కానీ, ఇదంతా ఒకప్పటి మాత్రం. ఇప్పుడు అతనికి టీమిండియాలో అవకాశాలు ఇవ్వడం కూడా దండగా, ఇక నుంచి అతను జట్టులో కనిపించడం కష్టమే అన్న అభిప్రాయాలను వినిపిస్తున్నాయి. అయితే.. గతంలో సంజు శాంసన్‌కు టీమిండియాలో చోటు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన అభిమానులు కూడా ఇప్పుడు సైలెంట్‌ అయిపోయారు. సంజు కోసం తిరువనంతపురంలో టీమిండియా మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో అతన్ని టీమ్‌లోకి తీసుకోనందుకు అతని ఫ్యాన్స్‌ ధర్నాకు కూడా దిగారు.

అలాంటి స్టేజ్‌ నుంచి ఇప్పుడు జట్టులో చోటుఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని వాళ్లే అంటున్నారు. అందుకు సంజు ఆటే కారణం. ఎన్నో అంచనాల మధ్య, వెస్టిండీస్‌ జట్టుతో సిరీస్‌కు ఎంపికైన సంజు.. వన్డే, టీ20 రెండు సిరీస్‌లలోనూ దారుణంగా విఫలం అయ్యాడు. రెండు వన్డేలు, ఐదు టీ20లు ఆడిన సంజు శాంసన్‌ కేవలం ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ సాధించాడు. రెండు టీ20ల్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, బ్యాటింగ్‌ చేసే అవకాశం, జట్టును ఆదుకునే పరిస్థితులు ఉన్న మూడు టీ20ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. ఒకసారి సంజు శాంసన్‌ వెస్టిండీస్‌ టూర్‌లో ఆడిన ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే, వరుసగా.. 9, 51, 12, 7, 13 మాత్రమే చేశాడు.

అందులో 9, 51 పరుగులు వన్డే సిరీస్‌లో చేసినవి కాగా, 12, 7, 13 అతని టీ20 స్కోర్లు. ఈ గణాంకాలు చూస్తే.. సంజు ఫామ్‌లో లేడనే విషయం కనీస క్రికెట్‌ నాలెడ్జ్‌ ఉన్న వాళ్లకి కూడా తెలుస్తుంది. అయితే.. ప్రస్తుతం సంజు ఆడిన ఇన్నింగ్స్‌లు, అవుటైన తీరు, చేసిన పరుగులు చూస్తే.. అతన్ని ఆసియా కప్‌ 2023కు ఎంపిక చేసే అవకాశం లేదు. ఆసియా కప్‌ ఆడకుంటే.. స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా సంజుకు చోటు అసాధ్యం. అయితే.. మరో వారంలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో సంజు ఆడుతున్నా.. పసికూన జట్టుపై పరుగులు చేసినా పెద్దగా ఇంప్యాక్ట్‌ ఉండకపోవచ్చు. ఇక ఐపీఎల్‌ 2024లో సంజు రాణించినా.. అప్పటికే టీమిండియాలో ఉన్న ప్లేయర్లు ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ ఆడి మంచి ప్రదర్శన చేస్తే.. టీమ్‌లో ఖాలీ ఉండదు. పైగా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రూపంలో టీమ్‌లో ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు. వారిని దాటుకుని, ఈ ప్రదర్శనతో సంజు టీమిండియాలో చోటు సాధించడం కష్టమనే చెప్పాలి. దీంతో ఇప్పటికైతే.. సంజు శాంసన్‌ కథ టీమిండియాలో ముగిసినట్లే కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విండీస్‌దే సిరీస్‌! చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి 4 ప్రధాన కారణాలు

Show comments