iDreamPost
android-app
ios-app

సంజూ సక్సెస్ సీక్రెట్ అదేనా? ఐర్లాండ్​పై అందుకే చెలరేగి ఆడాడా?

  • Author singhj Published - 04:49 PM, Mon - 21 August 23
  • Author singhj Published - 04:49 PM, Mon - 21 August 23
సంజూ సక్సెస్ సీక్రెట్ అదేనా? ఐర్లాండ్​పై అందుకే చెలరేగి ఆడాడా?

టీమిండియా కుర్రాళ్లు మరోమారు అదరగొట్టారు. కోరుకున్న విధంగానే బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఐర్లాండ్​ను కొట్టేశారు. వర్షం కారణంగా డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు గెలిచిన మొదటి టీ20లో మన ప్లేయర్ల బ్యాటింగ్ మెరుపులు చూసే ఛాన్స్ దక్కలేదు. కానీ ఆ లోటును తీరుస్తూ రెండో టీ20లో భారత బ్యాటర్లు బ్యాటింగ్​లో మెరిశారు. బౌండరీలు, సిక్సర్లతో అలరించారు. బౌలర్లు కూడా తమ జోరు కొనసాగించడంతో ఘనవిజయం సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్​ను సొంతం చేసుకుంది. తొలుత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 రన్స్ చేసింది.

రుతురాజ్ గైక్వాడ్​ (58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సంజూ శాంసన్ (40)తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రింకూ సింగ్ (38) కూడా రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో మెకార్తి 2 వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 రన్స్ చేసింది. కెప్టెన్ జస్​ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లతో సమష్టిగా రాణించారు. ఈ సిరీస్​లో ఆఖరి టీ20 బుధవారం జరుగుతుంది. ఇకపోతే, రెండో టీ20లో సంజూ శాంసన్ రాణించడం శుభపరిణామంగా చెప్పొచ్చు. సరిగ్గా అవకాశాలు రాక ఇబ్బంది పడ్డ ఈ బ్యాటర్.. వచ్చిన ఛాన్సులను వినియోగించుకోవడంలో తడబడుతున్నాడు.

వరుసగా ఫెయిల్ అవుతుండటంతో సంజూ శాంసన్​పై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో చక్కటి ఇన్నింగ్స్​తో సత్తా చాటాడు శాంసన్. ఇకపోతే, సౌత్ సూపర్​స్టార్ రజినీకాంత్​ అంటే సంజూకు చాలా ఇష్టం. తలైవాను విపరీతంగా అభిమానించే వారిలో శాంసన్ కూడా ఒకడు. రజినీపై తనకు ఉన్న ప్రేమను మరోమారు చాటుకున్నాడీ స్టార్ బ్యాటర్. తలైవా నటించిన ‘జైలర్’ మూవీని శనివారం ఐర్లాండ్​లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. దీనికి సంజూ స్పెషల్ గెస్ట్​గా అటెండ్ అయ్యాడు. ఆదివారం జరిగిన మ్యాచ్​లో ఐర్లాండ్​ బౌలర్లపై విజృంభించి ఆడాడు. దీంతో సంజూ సక్సెస్ వెనుక తలైవా రజినీకాంత్ ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘జైలర్’ చూశాక సంజూ రెచ్చిపోయి ఆడాడని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetbetsmoveMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbet