iDreamPost
android-app
ios-app

World Cup: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. చిన్నపిల్లల్లా ఏడ్చిన టీమిండియా క్రికెటర్లు!

  • Published Oct 23, 2023 | 11:20 AMUpdated Oct 23, 2023 | 11:20 AM

న్యూజిలాండ్‌పై దాదాపు 20 ఏళ్ల తర్వాత టీమిండియా వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో విజయం సాధించింది. దీంతో 2019 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఎదురైన ఓటమికి బదులుతీర్చుకుంది. అయితే.. టీమిండియా ఆటగాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారని, ధోని చిన్నపిల్లాడిలా ఏడ్చాడంటూ టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు.

న్యూజిలాండ్‌పై దాదాపు 20 ఏళ్ల తర్వాత టీమిండియా వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో విజయం సాధించింది. దీంతో 2019 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఎదురైన ఓటమికి బదులుతీర్చుకుంది. అయితే.. టీమిండియా ఆటగాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారని, ధోని చిన్నపిల్లాడిలా ఏడ్చాడంటూ టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు.

  • Published Oct 23, 2023 | 11:20 AMUpdated Oct 23, 2023 | 11:20 AM
World Cup: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. చిన్నపిల్లల్లా ఏడ్చిన టీమిండియా క్రికెటర్లు!

వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న న్యూజిలాండ్‌పై గెలిస్తే.. సంతోషపడాలే గానీ, టీమిండియా ఆటగాళ్లు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారని భావిస్తున్నారా? అయితే.. ఇది ఈ మ్యాచ్‌లో కాదులేండి. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో కివీస్‌పై ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ధోని రనౌట్‌ ఇంకా భారత క్రికెట్‌ అభిమానులను వేధిస్తూనే ఉంటుంది. ఆ రనౌట్‌ తర్వాత ధోని ముఖంలో బాధని ఎవరూ మర్చిపోలేరు. అయితే.. ఆ మ్యాచ్‌ తర్వాత టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఎంత విషాదం నెలకొందో తాజాగా వెలుగులోని వచ్చింది.

టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ తాజాగా 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో ఆయన టీమిండియాకు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు. రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌గా ఉన్నారు. సెమీస్‌లో టీమిండియా 240 పరుగులు ఛేజ్‌ చేయాల్సి వచ్చింది. అయితే.. అప్పటి వరకు టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న రోహిత్‌ శర్మ, అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. వారితో పాటు కేఎల్‌ రాహుల్ సైతం ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. దీంతో.. టీమిండియా ఆరంభంలోనే ఊహించని షాక్‌ తగిలింది.

కానీ, చివర్లో ధోని-రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి.. టీమిండియాను విజయం వైపుగా నడిపించారు. ధోని-జడేజా ఆడుతున్న తీరు చూసి ఇక టీమిండియా ఫైనల్‌ చేరినట్లేనని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ధోని 48వ ఓవర్‌లో రనౌట్‌ అయ్యాడు. మార్టిన్‌ గప్టిల్‌ అద్భుతమైన త్రోతో.. క్రీజ్‌కు ఇంచు దూరంలో ధోని బ్యాట్‌ ఉండిపోయింది. దీంతో.. ధోని కళ్లలో నీళ్లు తెచ్చుకుంటూ పెవిలియన్‌ వెళ్లడం సగటు భారతీయుడి గుండెను బరువెక్కించింది. 240 టార్గెట్‌ ఛేదించే క్రమంలో టీమిండియా 221 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారని బంగర్‌ అన్నారు. చాలా మంది ఏడ్చారని, ముఖ్యంగా ధోని చిన్నపిల్లాడిలా ఏడ్చాడని, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ కళ్లు నీళ్లతో నిండిపోయాయని పేర్కొన్నాడు. ఆ ఓటమి జట్టులో తీవ్ర దుఃఖాన్ని నింపినట్లు వెల్లడించాడు. అయితే.. ఆ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఈ వరల్డ్‌ కప్‌లో ప్రతీకారం తీర్చుకుంది. గత వరల్డ్‌ కప్‌లో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా భారత జట్టు దూసుకెళ్తోంది. మరి 2019 వరల్డ్‌ కప్‌లో సెమీస్‌లో టీమిండియా ఓటమిపై, అలాగే ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: 4 మ్యాచ్‌లు ఆడించకపోవడంపై స్పందించిన షమీ! ఏమన్నాడంటే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి