బెన్ స్టోక్స్.. ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణం.. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై కూడా బజ్ బాల్ స్ట్రాటజీని ఉపయోగించి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ స్ట్రాటజీ విఫలం అయ్యి.. ప్రతిష్టాత్మకమైన యాషెస్ తొలి టెస్ట్ లో ఓటమిని మూటగట్టుకుంది. దాంతో కొంత మంది తొలి రోజే ఇంగ్లాండ్ డిక్లేర్ ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెన్ స్టోక్స్ కెప్టెన్సీ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. అయితే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర మాత్రం బెన్ స్టోక్స్ పై ప్రశంసలు కురిపించాడు. అతడి ఫీల్డ్ సెటప్ అద్భుతమంటూ కొనియాడాడు.
యాషెస్ తొలి టెస్ట్ లో కొత్త కొత్త ఫీల్డ్ సెటప్ లతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. వెరైటీ ఫీల్డింగ్ సెట్ చేసి కంగారూలను నిజంగానే కంగారు పెట్టాడు. ఇక బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ సెటప్ పై ప్రశంసల కురిపించాడు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర.ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ ఉపయోగించిన ఫీల్డింగ్ వ్యూహం ఎక్కువగా ధోని ఉపయోగించే వాడని సంగక్కర చెప్పుకొచ్చాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సంగక్కర.. చివరి రోజు ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తుండగా, స్టోక్స్ పెట్టిన ఫీల్డింగ్ ను చూసి ఆశ్చర్యానికి లోనైయ్యాడు.
ఈ క్రమంలోనే ఇలా స్ట్రైట్ గా బౌలర్ పక్కనే ఫీల్డర్ ను ఎక్కువగా ధోని పెడుతుంటాడు అని సంగక్కర గుర్తు చేశాడు. బహుశా ధోని నుంచి ఈ తరహా ఫీల్డింగ్ సెటప్ ను స్టోక్స్ కాపీ కొట్టాడని సంగక్కర చమత్కరించాడు. ఇక ఈ మ్యాచ్ లో స్మిత్, ఖవాజా, ట్రావిస్ హెడ్ లను తన వెరైటీ ఫీల్డింగ్ సెటప్ తోనే అవుట్ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు స్టోక్స్. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ తన కెప్టెన్సీ వ్యూహాలతో మన్ననలు పొందుతున్నాడు.