టీ20 సిరీస్‌కి ముందు భారత్‌ వార్నింగ్‌ ఇచ్చిన శ్రీలంక కోచ్‌ జయసూర్య!

Sanath Jayasuriya, IND vs SL, Virat Kohli, Rohit Sharma: శ్రీలంక కొత్త కోచ్‌ జనత్‌ జయసూర్య.. టీమిండియాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ ఆటగాళ్లు లేని టీమిండియాను చిత్తుగా ఓడిస్తామన్నాడు. మరి అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

Sanath Jayasuriya, IND vs SL, Virat Kohli, Rohit Sharma: శ్రీలంక కొత్త కోచ్‌ జనత్‌ జయసూర్య.. టీమిండియాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఆ ఆటగాళ్లు లేని టీమిండియాను చిత్తుగా ఓడిస్తామన్నాడు. మరి అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌కి ముందు శ్రీలంక హెడ్‌ కోచ్‌, దిగ్గజ మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య.. భారత జట్టుకు వార్నింగ్‌ ఇచ్చాడు. తమతో టీ20 సిరీస్‌ ఆడేందుకు వచ్చిన భారత జట్టులో ఆ ఆటగాళ్లు లేరని, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటూ.. టీమిండియాను చిత్తుగా ఓడిస్తామంటూ పేర్కొన్నాడు. టీమ్‌లో ఆ ఆటగాళ్లు లేరు.. అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది.. వాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అని. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

కోహ్లీ, రోహిత్‌ టీ20 రిటైర్మెంట్‌ తర్వాత.. టీమిండియా ఓ స్ట్రాంగ్‌ టీమ్‌ను ఎదుర్కొబోతుంది. అయితే.. టీమిండియాలో రోహిత్‌ శర్మ, కోహ్లీ ఎంత కీలక ఆటగాళ్లో ఒక దిగ్గజ క్రికెటర్‌ అయిన సనత్‌ జయసూర్యకు బాగా తెలుసు. అందుకే.. వాళ్లు లేని టీమిండియాను ఓడిస్తామంటూ పేర్కొన్నాడు. జయసూర్యకు హెడ్‌ కోచ్‌గా ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో శ్రీలంక చెత్త ప్రదర్శన తర్వాత.. క్రిస్ సిల్వర్‌వుడ్ రాజీనామా చేయడంతో.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు జయసూర్యను హెడ్‌ కోచ్‌గా నియమించింది.

హెడ్‌ కోచ్‌గా తొలి సిరీస్‌లోనే టీమిండియా లాంటి ఛాంపియన్‌ టీమ్‌ను ఓడించి.. సక్సెస్‌ఫుల్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాలని జయసూర్య భావిస్తున్నాడు. టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌ కోసం ఇటీవలె శ్రీలంక క్రికెట్‌ బోర్డు జట్టును కూడా ప్రకటించింది. చరిత అసలంకను కొత్త కెప్టెన్‌గా నియమించింది. అయితే.. రోహిత్‌, కోహ్లీ లేని టీమిండియాపై గెలుస్తామంటూ జయసూర్య చేసిన కామెంట్స్‌పై భారత క్రికెట్‌ అభిమానులు రియాక్ట్‌ అవుతూ.. రోహిత్‌, కోహ్లీ లాంటి స్టార్లు లేకపోయినా.. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న యంగస్టర్లు శ్రీలంకను చిత్తుగా ఓడిస్తారంటూ పేర్కొంటున్నారు. రోహిత్‌ ప్లేస్‌లో గిల్‌, కోహ్లీ పేస్‌లో సంజు శాంసన్‌ రఫ్పాడిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి టీ20 సిరీస్‌కి ముందు జయసూర్య చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments