iDreamPost
android-app
ios-app

కోహ్లీ ఆడలేదని, గంభీర్‌ వేస్ట్‌ అని తిట్టడం కాదు! శ్రీలంక వెనకున్న శక్తి గురించి తెలుసుకోండి

  • Published Aug 08, 2024 | 5:43 PM Updated Updated Aug 08, 2024 | 5:43 PM

Sanath Jayasuriya, IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఓడిపోవడంతో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. అసలు లంక విజయం వెనుక ఉన్న ఓ శక్తిని మర్చిపోతున్నారు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Sanath Jayasuriya, IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఓడిపోవడంతో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. అసలు లంక విజయం వెనుక ఉన్న ఓ శక్తిని మర్చిపోతున్నారు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 08, 2024 | 5:43 PMUpdated Aug 08, 2024 | 5:43 PM
కోహ్లీ ఆడలేదని, గంభీర్‌ వేస్ట్‌ అని తిట్టడం కాదు! శ్రీలంక వెనకున్న శక్తి గురించి తెలుసుకోండి

శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 0-2తో కోల్పోయింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత లంకపై వన్డే సిరీస్‌ ఓడిపోయింది భారత జట్టు. ఈ వన్డే సిరీస్‌ కంటే ముందు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ ఆడి.. 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. కానీ, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ లాంటి హేమాహేమీలు తిరిగి వచ్చినా.. సిరీస్‌ను గెలిపించలేకపోయారు. ముఖ్యంగా బ్యాటింగ్‌ వైఫల్య​ంతోనే టీమిండియా సిరీస్‌ ఓటమిని చవిచూసింది. దీంతో.. కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌తో పాటు ఈ సిరీస్‌లో విఫలమైన విరాట్‌ కోహ్లీపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

కానీ, పటిష్టమైన టీమిండియాపై శ్రీలంక ఈ రేంజ్‌లో తిరగబడేందుకే కేవలం మన జట్టు ఫెల్యూయిర్‌ మాత్రమే.. లంకను నడిపించిన శక్తి ఏంటో కూడా తెలుసుకోవాలి. ఈ వన్డే సిరీస్‌లో శ్రీలంక ఇంత బాగా ఆడిందంటే.. అందులో చాలా వరకు క్రెడిట్‌ ఆ జట్టు హెడ్‌ కోచ్‌ సనత్‌ జయసూర్యకు దక్కుతుంది. శ్రీలంకను ఒక ఫోర్స్‌లా వెనుక నుంచి నడిపించింది అతనే. అయితే… ఈ వన్డే సిరీస్‌ కంటే ముందు ఇండియాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ లంకకు జయసూర్యనే హెడ్‌ కోచ్‌గా ఉన్నా.. అదే తన తొలి సిరీస్‌ కావడంతో అప్పటికీ పూర్తి స్థాయిలో కుదురుకోలేదు.

 

వన్డే సిరీస్‌కు వచ్చేటప్పటికీ.. జయసూర్య టీమ్‌ను పూర్తిగా రీడ్‌ చేశాడు. జట్టు బలాబలాలపై పట్టు పెట్టుకుని.. టీమిండియాపై సరిగ్గా ప్రయోగించాడు. పిచ్‌ కండీషన్స్‌ను ఉపయోగించుకుంటూ.. స్పిన్‌ బౌలర్లను పెంచి.. మంచి రిజల్ట్‌ రాబట్టాడు. పైగా ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్‌లో జయసూర్యకు ఎంతో అనుభవం ఉంది. ఒక ఆల్‌రౌండర్‌గా.. జయసూర్యకు కొలంబోలోని ప్రేమదాస పిచ్‌పై మంచి అవగాహన ఉంది. తన ఎక్స్‌పీరియన్స్‌ అంతా ఉపయోగించి.. టీమ్‌లోని ప్రతి ప్లేయర్‌ను అద్భుతంగా వాడుకున్నాడు. అందుకే పటిష్టమైన టీమిండియాపై సిరీస్‌ విజయం సాధించగలిగాడు. మరి ఈ వన్డే సిరీస్‌ విజయంలో జయసూర్య పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.