SNP
Samit Dravid, Rahul Dravid, Maharaja Trophy 2024: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ టీ20 టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తాజాగా మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ విశేసాలు ఇప్పుడు చూద్దాం..
Samit Dravid, Rahul Dravid, Maharaja Trophy 2024: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ టీ20 టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తాజాగా మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ విశేసాలు ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మరోసారి తన సత్తా చూపించాడు. కర్ణాటక వేదికగా జరుగుతున్న మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 2024 టోర్నీలో మైసూర్ వారియర్స్ తరఫున ఆడుతున్న సమిత్.. గత రెండు మ్యాచ్‌ల కంటే చాలా మెరుగ్గా రాణించాడు. తొలి మ్యాచ్‌లో 7 పరుగులే చేసి నిరాశపర్చిన సమిత్.. రెండో మ్యాచ్‌లో ఒక అగ్రెసివ్ షాట్‌తో సిక్స్ కొట్టి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆదివారం గుల్బర్గా మైస్టిస్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఒక మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు సమిత్.
ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సమి.. నాలుగో ఓవర్‌లోనే క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది. ఓపెనర్లు ఎస్‌యూ కార్తీక్, కార్తీక్ సీఏ వెంటవెంటనే అవుట్ కావడంతో.. మైసూర్ వారియర్స్ జట్టు కేవలం 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కరున్ నాయర్‌తో కలిసి.. సమిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టడంతో పాటు.. మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. అదరగొట్టాడు. కేవలం 24 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 33 పరుగులు చేసి… కెప్టెన్ కరున్ నాయర్‌తో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ కరున్ నాయర్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సుచిత్ 40, సమిత్ 33 పరుగులు చేసి రాణించారు. ఇక 197 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన గుల్బర్గా సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 రన్స్ చేసి గెలిచింది. సమరన్ 60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేసి అదరగొట్టాడు. ప్రవీణ్ దూబే సైతం 37 రన్స్‌తో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మైసూర్ ఓడినా.. మంచి ప్రదర్శన కనబర్చిన సమిత్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తండ్రి ద్రవిడ్‌కు పూర్తి అపొజిట్‌గా అగ్రెసివ్ బ్యాటింగ్‌తో సమిత్ అదరగొడతున్నాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rahul Dravid son Samit Dravid score 33 off 24 deliveries in KSCA.👊🏻⭐
SAMIT DRAVID FUTURE…!!pic.twitter.com/vccDDAOLBR
— cricket addict’s (@cricket0addicts) August 18, 2024