SNP
Shoaib Malik, T20 World CUP 2024, Virat Kohli, Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ఇద్దరు భాతర ఆటగాళ్లకు నా సెల్యూట్ అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడో. మరి ఆ ఇద్దరు భాతర క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Shoaib Malik, T20 World CUP 2024, Virat Kohli, Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ఇద్దరు భాతర ఆటగాళ్లకు నా సెల్యూట్ అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడో. మరి ఆ ఇద్దరు భాతర క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత్ జట్టు ఆటగాళ్లపై ఎప్పుడూ విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు పాకిస్థాన్ క్రికెటర్లు. ఇటీవల ఇంజమామ్ ఉల్ హక్ టీమిండియా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. కానీ, మరో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ భారత క్రికెటర్లకు సెల్యూట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు టీమిండియా క్రికెటర్లను తిట్టడమే కానీ.. ఇలా ప్రశంసించడంపై టీమిండియా క్రికెట్ అభిమానుల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇద్దరు భాతర ఆటగాళ్లకు సెల్యూట్ అంటూ మాలిక్ ట్వీట్ చేశాడు. ఇంతకీ షోయబ్ మాలిక్ ఎవరి గురించి మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికి క్రికెట్ అభిమానులకు షాకిచ్చారు. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు ఒకే సారి టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. భారత క్రికెట్ అభిమానులు కాస్త బాధపడుతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంతో పాటు రోహిత్, కోహ్లీని ఇకపై టీ20 క్రికెట్‌లో టీమిండియా తరఫున చూడలేమంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై షోయబ్ మాలిక్ కూడా స్పందిస్తూ.. ‘ఇద్దరు(కోహ్లీ, రోహిత్) మోడ్రన్ క్రికెట్ దిగ్గజాలకు సెల్యూట్ చేస్తున్నాను! మీ అంకితభావం, అభిరుచి, అద్భుతమైన ప్రతిభ ఒక తరం ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో స్ఫూర్తి నింపాయి. భారత క్రికెట్‌కు మీరు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేయండి, వన్డే, టెస్టుల్లో మీ ఆటను కొనసాగించండి.’ అంటూ మాలిక్ ట్వీట్ చేశాడు.
కాగా.. కోహ్లీ, రోహిత్ శర్మ ఒకేసారి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియాకు టీ20ల్లో మరో కెప్టెన్ సెట్ అయ్యేంత వరకు ఇద్దరిలో ఒక్కరైనా కొన్ని రోజుల పాటు టీమ్‌లో ఉంటూ యువ క్రికెటర్లను నడిపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. యువ క్రికెటర్లకు జట్టులో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. విజయంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించడంపై అలాగే మాలిక్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Saluting two modern cricket greats! @imVkohli & @ImRo45, your dedication, passion and incredible talent have inspired a generation of players & fans. Your contributions to Indian cricket will forever be etched in history. Enjoy your well-deserved retirement! Keep up your GAME… pic.twitter.com/tDNvLKIYvM
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) June 29, 2024