పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన మాజీ ప్లేయర్ ను పాక్ టీమ్ కు సెలెక్టర్ గా ఎంపిక చేసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన మాజీ ప్లేయర్ ను పాక్ టీమ్ కు సెలెక్టర్ గా ఎంపిక చేసింది.
పాకిస్థాన్.. ఎప్పుడూ వివాదాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. ఇక టీమిండియా క్రికెటర్లపై తరచుగా తమ నోటిదూలతో అక్కసును వెళ్లగక్కుతూ ఉంటారు కొందరు పాక్ క్రికెటర్లు, మాజీలు. కాగా.. తాజాగా మరోసారి ఆశ్చర్యకర రీతిలో న్యూస్ లోకి ఎక్కింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో పట్టుబడి జైలు శిక్ష అనుభవించిన మాజీ ప్లేయర్ ను పాక్ టీమ్ కు సెలెక్టర్ గా ఎంపిక చేసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి జైలు శిక్ష అనుభవించిన పాక్ మాజీ ప్లేయర్ ను పాక్ జట్టుకు సెలెక్టర్ గా ఎంపిక చేసింది పీసీబీ. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. 2010లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గా సల్మాన్ భట్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్ లో అప్పటి తన సహచర ఆటగాళ్లు అయిన ఆసిఫ్, ఆమిర్ లతో నో బాల్స్ వేయించి స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు సల్మాన్ భట్. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇక ఈ ఫిక్సింగ్ ఉదంతంలో ఐసీసీ భట్ పై నిషేధంతో పాటుగా 30 నెలల జైలు శిక్ష విధించింది. కానీ అతడు 7 నెలలకే విడుదలై.. తిరిగి 2016లో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టినప్పటికీ.. పాక్ క్రికెట్ బోర్డ్ అతడివైపు చూడలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత సల్మాన్ సెలెక్టర్ గా రావడం గమనార్హం. ఇతడితో పాటు పాక్ మాజీ క్రికెటర్లు అయిన కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అంజుమ్ లు కూడా సెలెక్టర్లుగా ఎంపిక అయ్యారు. వీరు పాక్ చీఫ్ కోచ్ వహాబ్ రియాజ్ తో కలిసి పనిచేస్తారు. కాగా.. సల్మాన్ భట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. మరి ఓ మ్యాచ్ ఫిక్సర్ ను పాక్ సెలెక్టర్ గా ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The PCB has appointed former international cricketers Kamran Akmal, Rao Iftikhar Anjum and Salman Butt as consultant members to chief selector Wahab Riaz https://t.co/Kvpjv3fu18
— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2023