ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటలో దుమ్మురేపుతోంది. వరుసగా టెస్ట్, వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఇదే జోరును టీ20 సిరీస్ లో చూపించాలనుకుంది. కానీ తొలి టీ20లో 4 పరుగులతో పరాజయం చవిచూసింది టీమిండియా. ఇక ఈ పర్యటనలో టీమిండియా మేనేజ్ మెంట్ ప్రయోగాల బాట పట్టిన విషయం మనందరికి తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ.. యంగ్ ప్లేయర్ల సత్తాకు పరీక్షపెడుతున్నారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలోనే విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో దుమ్మురేపాడు టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్. మూడు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అయితే అతడు ఎంత చెలరేగినా, ఒకే మ్యాచ్ లో 1000 పరుగులు చేసినా అతడికి జట్టులో చోటు కష్టమే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.
ఇషాన్ కిషన్.. ప్రస్తుతం ఈ పేరు టీమిండియాలో హాట్ టాపిక్ గా మారింది. విండీస్ తో వన్డే సిరీస్ లో వరుసగా మూడు అర్దశతకాలతో రికార్డు సృష్టించాడు ఈ యువ ఓపెనర్. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో.. అతడికి అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాడు ఇషాన్ కిషన్. కాగా.. ఆసియా కప్-2023, వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల ముందు ఇషాన్ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కలిసోచ్చే అంశమే. ఇక రోహిత్, కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే.. ఇషాన్ కిషన్ కు జట్టులో చోటు కష్టమే. ఇదే విషయాన్ని బల్లగుద్దినట్లు చెబుతున్నాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.
తన యూట్యూబ్ ఛానల్ లో సల్మాన్ భట్ మాట్లాడుతూ..”టీమిండియా సెలక్షన్ కమిటీ ఇషాన్ కిషన్ పట్ల వ్యవహరిస్తున్న తీరు గందరగోళంగా ఉంది. ప్రయోగాలు ఇషాన్ కిషన్ ఎందుకు బలిచేస్తున్నారో అర్ధం కావట్లే. అతడి విషయంలో టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక అతడు ఒకే మ్యాచ్ లో 1000 పరుగులు చేసినా జట్టులో చోటు కష్టమే” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సల్మాన్ భట్. డబుల్ సెంచరీ చేసినా తుది జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడని గుర్తు చేశాడు సల్మాన్ భట్.
కాగా.. ఇషాన్ కిషన్ ను సెకండ్ ఆప్షన్ గానే టీమిండియా మేనేజ్ మెంట్ అంగీకరిస్తున్నట్లుగా పేర్కొన్నాడు పాక్ క్రికెటర్. ఒక ఆటగాడిని ఇలా చేయడం వల్ల అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని తన అభిప్రాయాం వ్యక్తం చేశాడు. ఒక ప్లేయర్ కు తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కాలి, అంతే తప్ప అతడిని సెకండ్ ఆప్షన్ గా భావించకూడదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ భట్. మరి ఇషాన్ కిషన్ పై సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించడం అంటే ఇదేనేమో! 32 బంతుల్లోనే..