జాక్‌పాట్‌ కొట్టేశారు.. జింబాబ్వే టూర్‌కు మరో ముగ్గురిని ఎంపిక చేసిన BCCI

జాక్‌పాట్‌ కొట్టేశారు.. జింబాబ్వే టూర్‌కు మరో ముగ్గురిని ఎంపిక చేసిన BCCI

Sai Sudharsan, Jitesh Sharma, Harshit Rana, IND vs ZIM: టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిందనే సంతోషంలో ఉన్న ఓ ముగ్గురు యువ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. టీమిండియాలోకి తీసుకుంటూ.. విదేశీ పర్యటనకు పంపింది. మరి ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Sai Sudharsan, Jitesh Sharma, Harshit Rana, IND vs ZIM: టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిందనే సంతోషంలో ఉన్న ఓ ముగ్గురు యువ క్రికెటర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. టీమిండియాలోకి తీసుకుంటూ.. విదేశీ పర్యటనకు పంపింది. మరి ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

దేశం మొత్తం ఇంకా టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన మూడ్‌లోనే ఉంది. అయితే.. మరోవైపు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు యంగ్‌ టీమిండియా ఆ దేశానికి పయనమైంది. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఉన్న వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ సిరీస్‌కు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. జింబాబ్వే సిరీస్‌కు భారత సెలెక్టర్లు ఇటీవలె స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా ఆ స్క్వౌడ్‌లో కొన్ని మార్పులు చేస్తూ.. మరో ముగ్గురు యువ క్రికెటర్లకు జట్టులో స్థానం కల్పించారు.

ఐపీఎల్‌లో అదరగొట్టిన సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను జింబాబ్వేతో ఆడబోయే తొలి రెండు టీ20లకు ఎంపిక చేశారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 స్క్వౌడ్‌లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌ల స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ముగిసినా.. భారత జట్టు ఇంకా వెస్టిండీస్‌లోనే ఉంది. హరికేన్‌ తుపాను కారణంగా విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో భారత ఆటగాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వరల్డ్‌ కప్‌ ముగించుకుని.. జింబాబ్వే టూర్‌కు వెళ్లాల్సిన శాంసన్‌, దూబే, జైస్వాల్‌లు అందుబాటులో లేకపోవడంతో ఐపీఎల్‌లో సత్తా చాటిన ఈ ముగ్గురిని సెలెక్టర్లు ఎంపిక చేశారు.

జూలై 6వ తేదీ శనివారం నుంచి జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. సుదర్శన్‌, జితేష్‌ శర్మ, హర్షిత్‌ రాణా తొలి రెండు టీ20ల వరకు టీమ్‌తో ఉంటారు. ఆ తర్వాత శాంసన్‌, దూబే, జైస్వాల్‌ జట్టుతో చేరితే.. ఈ ముగ్గురు తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. జింబాబ్వేతో తొలి టీ20లకు ఎంపిక చేసిన జట్టును ఒకసారి పరిశీలిస్తే.. శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), హర్షిత్ రాణా ఉన్నారు. మరి ఈ ఎంపికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments