iDreamPost

Sai Sudharsan: సాయి సుదర్శన్‌.. ఒక్క మ్యాచ్‌తోనే వాళ్లిద్దరిని భయపెడుతున్నాడుగా!

  • Published Dec 18, 2023 | 11:39 AMUpdated Dec 18, 2023 | 12:41 PM

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ మంచి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదే అతనికి తొలి వన్డే మ్యాచ్‌.. తొలి వన్డేలోనే ఇలాంటి ప్రదర్శనతో ప్రత్యర్థితో పాటు ఇద్దరు భారత ప్లేయర్లను భయపెడుతున్నాడు. మరి ఆ ఇద్దరు ఎవరు? ఎలా భయపెడుతున్నాడో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ మంచి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇదే అతనికి తొలి వన్డే మ్యాచ్‌.. తొలి వన్డేలోనే ఇలాంటి ప్రదర్శనతో ప్రత్యర్థితో పాటు ఇద్దరు భారత ప్లేయర్లను భయపెడుతున్నాడు. మరి ఆ ఇద్దరు ఎవరు? ఎలా భయపెడుతున్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 18, 2023 | 11:39 AMUpdated Dec 18, 2023 | 12:41 PM
Sai Sudharsan: సాయి సుదర్శన్‌.. ఒక్క మ్యాచ్‌తోనే వాళ్లిద్దరిని భయపెడుతున్నాడుగా!

సౌతాఫ్రికాతో మొదలైన మూడు వన్డేల సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని యంగ్‌ టీమిండియా శుభారంభం అందుకుంది. ఆదివారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రొటీస్‌ జట్టును తక్కువ స్కోర్‌కే కుప్పకూల్చారు భారత బౌలర్లు. ఆ తర్వాత కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమిండియా.. సింపుల్‌ టార్గెట్‌ను ఊదిపారేసింది. మొత్తంగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్‌ ఆడిన టీమిండియా విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ గురించి మాట్లాడుకోవాలి.

రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సాయి సుదర్శన్‌.. ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన కనబర్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. పటిష్టమైన సౌతాఫ్రికా బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కొని వాళ్ల గడ్డపైనే అదరగొట్టాడు. కేవలం 49 బంతుల్లోనే 9 ఫోర్లతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. తొలి ఇంటర్నేషనల్‌ వన్డేను చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. తన ఓపెనింగ్‌ పార్ట్నర్‌ రుతురాజ్‌ త్వరగానే అవుటైనా కూడా ఒత్తిడికి గురికాకుండా.. వన్‌ డౌన్‌లో వచ్చిన సీనియర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇంకా చెప్పాలంటే.. తన కంటే సీనియర్‌ అయిన అయ్యర్‌ కంటే వేగంగా ఆడుతూ.. ఎక్కువ మార్కులు కొట్టేశాడు.

sai sudarshan superb batting

సాయి సుదర్శన్‌ ఆడిన ఇన్నింగ్స్‌తో ఓ ఇద్దరు భారత ఆటగాళ్లకు డేంజర్‌ అనే చెప్పాలి. వాళ్లు ఎవరో కాదు.. యువ ఓపెనర్లు యశ్వస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌. రోహిత్‌ శర్మ రిటైర్‌ అయితే.. అతన్ని ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీ పడుతున్న వారిలో గైక్వాడ్‌, జైస్వాల్‌ ముందున్నారు. శుబ్‌మన్‌ గిల్‌కు రోహిత్‌ తర్వాత వన్డేల్లో ఓ భాగస్వామి కావాలి. అయితే.. ఇప్పుడు సాయి సుదర్శన తొలి వన్డేలో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబర్చడంతో.. ఇప్పుడు అతను కూడా పర్మినెంట్‌ ఓపెనింగ్‌ ప్లేస్‌కు పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. దీంతో.. తమ ఇద్దరికి మరో యంగ్‌ ప్లేయర్‌ కూడా పోటీ రావడం.. రుతురాజ్‌, జైస్వాల్‌లో కంగారు కలిగించే అవకాశం ఉంది. పైగా గిల్‌కు ఓ లెఫ్ట్‌ హ్యాండర్‌ పార్ట్నర్‌గా ఉంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అయితే.. జైస్వాల్‌ కూడా లెఫ్ట్‌ హ్యాండరే అయినా.. టీ20ల్లో బాగా రాణిస్తున్న జైస్వాల్‌ వన్డేల్లో కూడా సత్తా చాటాల్సి ఉంది. ఇక సుదర్శన్‌ నుంచి గైక్వాడ్‌కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. మరి తొలి వన్డేలో సాయి సుదర్శన్‌ ప్రదర్శనపై అలాగే జైస్వాల్‌, గైక్వాడ్‌ అతను పోటీ ఇస్తాడనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి