SNP
Saeed Anwar, Virat Kohli, RCB vs PBKS, IPL 2024: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై పాకి దిగ్గజ క్రికెటర్ స్పందించి.. టీ20 వరల్డ్ కప్ ముందు మిగతా టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా చేసుకుందాం..
Saeed Anwar, Virat Kohli, RCB vs PBKS, IPL 2024: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడిన షాట్‌పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై పాకి దిగ్గజ క్రికెటర్ స్పందించి.. టీ20 వరల్డ్ కప్ ముందు మిగతా టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా చేసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లీ 92 పరుగులతో చెలరేగడంతో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. ఏకంగా 60 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించి.. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 92 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. సెంచరీ మిస్ అయినా కూడా ఫీల్డింగ్‌లో సూపర్ రన్ అవుట్‌తో మ్యాచ్‌నే మలుపు తిప్పాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన ఓ షాట్ చర్చనీయాంశంగా మారింది.
పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ రెండో బంతికి కోహ్లీ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఆ షాట్‌ను చూసి.. వామ్మో కోహ్లీ ఇంత భయంకరంగా ఆడతాడా అంటూ క్రికెట్ అభిమానులే షాక్ అయ్యారు. ఈ షాట్‌పై దిగ్గజ మాజీ క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నా.. అతని స్ట్రైక్‌రేట్ అంత మెరుగ్గా లేదని కొంతమంది మాజీ క్రికెటర్లు కోహ్లీపై విమర్శలు గుప్పించారు. వాటిపై కోహ్లీ కూడా స్పందించాడు. ఈ క్రమంలోనే ఇలాంటి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లోనే 92 రన్స్ బాదేశాడు. 195.74 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ ఇన్నింగ్స్ ఆడి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. అయితే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన భారీ సిక్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ సైతం స్పందించాడు.
‘విరాట్ కోహ్లి ఇలాంటి షాట్లను కొట్టగలిగితే, ఎందుకు తరచుగా ఆడటం లేదు? బహుశా అతను బిగ్ మూమెంట్స్ కోసం వాటిని దాచి పెడుతున్నట్లు ఉన్నాడు. కోహ్లీని ఇలాంటి అద్భుతమైన షాట్లు ఆడటం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని సయీద్ అన్వర్ అన్నారు. కోహ్లీని చాలా మంది క్లాస్ ప్లేయర్‌గానే చూస్తారు. కానీ, సమయం వచ్చినప్పుడు మాస్ హిట్టింగ్ కూడా చేయగలడు. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని షాట్లు ఆడగలడు. ఆ విషయాన్ని టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టన స్ట్రేయిట్ సిక్స్ అందుకు మంచి ఉదాహరణ. ఈ టీ20 వరల్డ్ కప్‌లో కూడా కోహ్లీ ఇలాంటి అద్భుతమైన షాట్లు ఆడే అవకాశం ఉందని పరోక్షంగా సయీద్ అన్వర్ మిగతా టీమ్స్‌ను హెచ్చరించినట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
If Virat Kohli can hit these shots, why doesn’t he do it more often? Maybe he’s just saving them for the big moments. Either way, excited to see more of those amazing shots from him! #PBKSvsRCB pic.twitter.com/d9j2hv42gn
— Saeed Anwar (@ImSaeedAnwar) May 9, 2024