iDreamPost
android-app
ios-app

Sachin Tendulker: 25 ఏళ్ళ క్రితం జరిగిన ఓ అద్భుతం! సచిన్ కోసం 3 గంటలు ఆగిన ఆట!

  • Published Feb 19, 2024 | 4:20 PM Updated Updated Feb 19, 2024 | 6:42 PM

సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 19, 1999) పాకిస్థాన్ తో కోల్ కత్తా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ కు ఉన్న క్రేజ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సచిన్ కోసం 3 గంటలు ఆట ఆగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం.

సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 19, 1999) పాకిస్థాన్ తో కోల్ కత్తా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ కు ఉన్న క్రేజ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సచిన్ కోసం 3 గంటలు ఆట ఆగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం.

Sachin Tendulker: 25 ఏళ్ళ క్రితం జరిగిన ఓ అద్భుతం! సచిన్ కోసం 3 గంటలు ఆగిన ఆట!

సచిన్ టెండుల్కర్..ప్రపంచ క్రికెట్ కు పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు. వందల కొద్ది రికార్డులను తనపేరిట లిఖించుకున్నాడు ఈ క్రికెట్ గాడ్. అయితే సచిన్ అంటే ప్రపంచానికి తెలిసొచ్చిన రోజు ఇదే. సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 19, 1999) పాకిస్థాన్ తో కోల్ కత్తా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సచిన్ కు ఉన్న క్రేజ్ ఏంటో ఈ ప్రపంచానికి తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎందుకు మాస్టర్ బ్లాస్టర్ కొరకు మ్యాచ్ మధ్యలో 3 గంటలు ఆగాల్సి వచ్చింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1999 ఫిబ్రవరి 19 సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మర్చిపోలేని సంఘటన జరిగింది. ఈ ఒక్క సంఘటన చాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంటే ఏంటో తెలియజేయడానికి. అసలేం జరిగిందంటే? ఏసియన్ ఛాంపియన్ షిప్ 1998-99లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయింది. దానికి కారణం సచిన్ టెండుల్కర్.

ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ సంచలన సంఘటన జరిగింది. ఇన్నింగ్స్ 43వ ఓవర్ లో సచిన్ రన్ కోసం పరిగెడుతుండగా.. అక్తర్ సచిన్ ను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ 9 పరుగులకే దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఈ ఔట్ కాంట్రవర్సీ కావడంతో, చీటింగ్.. చీటింగ్ అంటూ గ్రౌండ్ మెుత్తం నినాదాలతో హోరెత్తింది. ప్రేక్షకులు తమ చేతికి ఏది దొరికితే అది.. వాటర్ బాటిల్స్ తో సహా అన్ని వస్తువులను మైదానంలోకి విసిరేయడం మెుదలు పెట్టారు. ఇలా ఏకంగా 3 గంటల పాటు సాగింది.

దీంతో స్వయంగా సచిన్ గ్రౌండ్ లో తిరుగుతూ.. ప్రేక్షకులను నచ్చజెప్పాడు. మ్యాచ్ ను సజావుగా సాగనివ్వండని రిక్వెస్ట్ చేశాడు. తమ అభిమాన ఆటగాడు చెప్పడంతో.. ఫ్యాన్స్ శాంతించారు. అప్పుడు తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు పాక్ ఆటగాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. గ్రౌండ్ లో సచిన్ క్రేజ్ చూసి.. పాక్ ప్లేయర్లు బిత్తరపోయారు. ఈ రోజుతో ఈ సంఘటనకు సరిగ్గా 25 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ఫ్యాన్స్ మరోసారి దీన్ని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. అందుకే సచిన్ ను క్రికెట్ గాడ్ అంటారని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. మరి క్రికెట్ దిగ్గజం సచిన్ కోసం మ్యాచ్ 3 గంటలు ఆగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Rohit Sharma: దాదా, ధోని, కోహ్లీ రికార్డ్స్‌ గల్లంతు! టెస్ట్‌ కెప్టెన్‌గా రోహిత్‌ కొత్త చరిత్ర..