Nidhan
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విధ్వంసం సృష్టిస్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని తొక్కుకుంటూ దూసుకెళ్తోంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు విధ్వంసం సృష్టిస్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని తొక్కుకుంటూ దూసుకెళ్తోంది.
Nidhan
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్‌లో ఒకటి. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఈ జట్టుకు భారీగా అభిమాన గణం ఉంది. ప్రతిసారి ఐపీఎల్లో బిగ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో బరిలోకి దిగే ముంబై.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటోంది. చివరగా 2020లో కప్పు కొట్టిన ముంబై.. గతేడాది ప్లేఆఫ్స్ వరకు చేరుకున్నా ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ సీజన్లో ఏం చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఒక టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతోంది. కానీ అది ఐపీఎల్ కాదు.. ఎస్ఏ20 లీగ్. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20-2024 లీగ్‌లో ముంబైకి చెందిన ఎంఐ కేప్‌టౌన్ టీమ్ విధ్వంసం సృష్టిస్తోంది. తమకు ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ దూసుకెళ్తోంది.
ఎస్ఏ 20 లీగ్‌లో ఇప్పటిదాకా రెండు మ్యాచులు ఆడిన ఎంఐ కేప్‌టౌన్ ఘనవిజయాలు సాధించింది. జనవరి 11వ తేదీన డర్బన్స్ సూపర్ జియాంట్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 20 ఓవర్లు ఆడి 207 పరుగులు చేసింది ముంబై. ఛేజింగ్‌కు దిగిన ప్రత్యర్థి జట్టు 177 పరుగులే చేసి ఓటమి పాలైంది. శనివారం ఆడిన రెండో మ్యాచ్‌లో 98 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్ ఓవర్లన్నీ ఆడి 243 పరుగులు భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయింది. ర్యాన్ రికల్టన్, వాండర్ డస్సెన్ ఇద్దరూ చెలరేగి బ్యాటింగ్ చేస్తుండటంతో ముంబైని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇదే ఊపును టోర్నీ ఆసాంతం కొనసాగిస్తే ఎంఐ కేప్‌టౌన్ కప్పు కొట్టడం ఖాయమనే చెప్పాలి.
ఎస్ఏ20లో ఎంఐ కేప్‌టౌన్ ఆడుతున్న తీరును చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. భారీ టార్గెట్లు సెట్ చేయడం, అపోజిషన్ టీమ్స్‌ను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడంతో ముంబైతో మ్యాచ్ అంటేనే అందరూ వణుకుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీపై కన్నేసిన ముంబై ఇండియన్స్‌కు కప్పు కంటే జట్టులోని ఇతర విషయాలే సమస్యగా మారాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఆ టీమ్ ఆందోళనలో ఉంది. అదే టైమ్‌లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఈ సీజన్లో అతడి అభిమానుల నుంచి గ్రౌండ్లో వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తోంది. ఈ టైమ్‌లో సౌతాఫ్రికాలో తమ జట్టు అదరగొడుతుండటంతో సంతోషంలో మునిగిపోయింది. ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆడాలని, ఏ అవాంతరాలు రావొద్దని కోరుకుంటోంది. మరి.. సౌతాఫ్రికా లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ అదరగొడుతుండటం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇషాన్ కిషన్‌కు మరో బిగ్ షాక్! KL స్థానంలో తెలుగోడు ఫిక్స్!
MI Cape Town secures a comprehensive victory against Joburg Super Kings. pic.twitter.com/tkUrztvwZD
— CricTracker (@Cricketracker) January 13, 2024