iDreamPost
android-app
ios-app

MI Cape Town: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ముంబై ఇండియన్స్‌!

  • Published Jan 14, 2024 | 3:32 PM Updated Updated Jan 14, 2024 | 3:32 PM

సౌతాఫ్రికా టీ20 లీగ్​లో ముంబై ఇండియన్స్ జట్టు విధ్వంసం సృష్టిస్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని తొక్కుకుంటూ దూసుకెళ్తోంది.

సౌతాఫ్రికా టీ20 లీగ్​లో ముంబై ఇండియన్స్ జట్టు విధ్వంసం సృష్టిస్తోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని తొక్కుకుంటూ దూసుకెళ్తోంది.

  • Published Jan 14, 2024 | 3:32 PMUpdated Jan 14, 2024 | 3:32 PM
MI Cape Town: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ముంబై ఇండియన్స్‌!

ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో హ్యూజ్ ఫ్యాన్​ బేస్ ఉన్న టీమ్స్​లో ఒకటి. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్​గా నిలిచిన ఈ జట్టుకు భారీగా అభిమాన గణం ఉంది. ప్రతిసారి ఐపీఎల్​లో బిగ్ ఎక్స్​పెక్టేషన్స్​తో బరిలోకి దిగే ముంబై.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటోంది. చివరగా 2020లో కప్పు కొట్టిన ముంబై.. గతేడాది ప్లేఆఫ్స్​ వరకు చేరుకున్నా ఫైనల్స్​కు వెళ్లలేకపోయింది. దీంతో ఈ సీజన్​లో ఏం చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఒక టోర్నమెంట్​లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతోంది. కానీ అది ఐపీఎల్​ కాదు.. ఎస్​ఏ20 లీగ్​. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్​ఏ20-2024 లీగ్​లో ముంబైకి చెందిన ఎంఐ కేప్​టౌన్ టీమ్ విధ్వంసం సృష్టిస్తోంది. తమకు ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ దూసుకెళ్తోంది.

ఎస్​ఏ 20 లీగ్​లో ఇప్పటిదాకా రెండు మ్యాచులు ఆడిన ఎంఐ కేప్​టౌన్ ఘనవిజయాలు సాధించింది. జనవరి 11వ తేదీన డర్బన్స్ సూపర్ జియాంట్స్​తో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో 20 ఓవర్లు ఆడి 207 పరుగులు చేసింది ముంబై. ఛేజింగ్​కు దిగిన ప్రత్యర్థి జట్టు 177 పరుగులే చేసి ఓటమి పాలైంది. శనివారం ఆడిన రెండో మ్యాచ్​లో 98 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఎంఐ కేప్​టౌన్ ఓవర్లన్నీ ఆడి 243 పరుగులు భారీ స్కోరు చేసింది. కష్టసాధ్యమైన స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయింది. ర్యాన్ రికల్టన్, వాండర్ డస్సెన్ ఇద్దరూ చెలరేగి బ్యాటింగ్ చేస్తుండటంతో ముంబైని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. ఇదే ఊపును టోర్నీ ఆసాంతం కొనసాగిస్తే ఎంఐ కేప్​టౌన్ కప్పు కొట్టడం ఖాయమనే చెప్పాలి.

ఎస్​ఏ20లో ఎంఐ కేప్​టౌన్ ఆడుతున్న తీరును చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. భారీ టార్గెట్లు సెట్ చేయడం, అపోజిషన్ టీమ్స్​ను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడంతో ముంబైతో మ్యాచ్ అంటేనే అందరూ వణుకుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఐపీఎల్​ ట్రోఫీపై కన్నేసిన ముంబై ఇండియన్స్​కు కప్పు కంటే జట్టులోని ఇతర విషయాలే సమస్యగా మారాయి. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఆ టీమ్ ఆందోళనలో ఉంది. అదే టైమ్​లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఈ సీజన్​లో అతడి అభిమానుల నుంచి గ్రౌండ్​లో వచ్చే వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తోంది. ఈ టైమ్​లో సౌతాఫ్రికాలో తమ జట్టు అదరగొడుతుండటంతో సంతోషంలో మునిగిపోయింది. ఐపీఎల్​లోనూ ఇలాగే ఆడాలని, ఏ అవాంతరాలు రావొద్దని కోరుకుంటోంది. మరి.. సౌతాఫ్రికా లీగ్​లో ఎంఐ కేప్​టౌన్ అదరగొడుతుండటం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇషాన్‌ కిషన్‌కు మరో బిగ్‌ షాక్‌! KL స్థానంలో తెలుగోడు ఫిక్స్‌!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet