iDreamPost
android-app
ios-app

Riyan Parag: నాకు అహంకారం లేదు.. ఏదో ఒకరోజు నన్ను ఎంపిక చేయాల్సిందే: రియాన్ పరాగ్

  • Published May 30, 2024 | 9:19 AM Updated Updated May 30, 2024 | 9:19 AM

నాకు అహంకారం లేదు.. ఏదో ఒకరోజు నన్ను టీమిండియాకు ఎంపిక చేయాల్సిందేనని యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. పరాగ్ ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

నాకు అహంకారం లేదు.. ఏదో ఒకరోజు నన్ను టీమిండియాకు ఎంపిక చేయాల్సిందేనని యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్ సంచలన కామెంట్స్ చేశాడు. పరాగ్ ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

Riyan Parag: నాకు అహంకారం లేదు.. ఏదో ఒకరోజు నన్ను ఎంపిక చేయాల్సిందే: రియాన్ పరాగ్

రియాన్ పరాగ్.. తన ఆటతో కంటే ఓవరాక్షన్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. పరాగ్ అద్భుతమైన ఆటగాడే అయినప్పటికీ.. తన యాటిట్యూడ్ తో ఓవరాక్షన్ స్టార్ గా పేరుగాంచాడు. అయితే ఐపీఎల్ లో చాలా సంవత్సరాలుగా ఆడుతున్నప్పటికీ.. గోప్ప ప్రదర్శనలు చేయలేదు. అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకునేవాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దాంతో టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని పరాగ్ భావించాడు. కానీ.. అతడికి నిరాశే మిగిలింది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పరాగ్.

ఐపీఎల్ 2024 సీజన్ లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు రియాన్ పరాగ్. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన పరాగ్.. 14 మ్యాచ్ ల్లో 573 పరుగులు చేసి, టోర్నీలో టాప్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని అతడు భావించినప్పటికీ.. సెలెక్షన్ కమిటీ మాత్రం పరాగ్ ను పరిగణంలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఈ విషయంపై అతడు మాట్లాడాడు.

“నేను 10 ఏళ్లకే క్రికెట్ ఆడటం మెుదలుపెట్టాను. అప్పుడే అనుకున్నాను.. నేను టీమిండియాకు ఆడతానని. అదీకాక సరిగ్గా ఆడనప్పుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పా.. భారత్ కు ఆడతానని. నాకు అహంకారం లేదు.. ఏదో ఒకరోజు నన్ను టీమిండియాకు ఎంపిక చేయకతప్పదు. అది ఏ రోజు అన్నది చెప్పలేను గానీ.. భారత్ కు ఆడటం మాత్రం పక్కా” అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పాడు రియాన్ పరాగ్. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్తాన్ టీమ్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా అతడి యూట్యూబ్ హిస్టరీ లీక్ కావడంతో.. విమర్శలపాలైయ్యాడు. మరి ఇంత నమ్మకంతో టీమిండియాకు ఆడతానని చెప్పిన పరాగ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.