iDreamPost

వీడియో: ఇలా కూడా అవుట్‌ అవుతారా? క్రికెట్‌ చరిత్రలోనే మోస్ట్‌ అన్‌లక్కీ ఫెలో రుతురాజ్‌!

  • Published Jun 08, 2024 | 12:45 PMUpdated Jun 08, 2024 | 12:45 PM

Ruturaj Gaikwad, Maharashtra Premier League: టీమిండియా క్రికెటర్‌, ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చాలా విచిత్రంగా రనౌట్‌ అయ్యాడు. మరి ఈ రనౌట్‌ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ruturaj Gaikwad, Maharashtra Premier League: టీమిండియా క్రికెటర్‌, ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ చాలా విచిత్రంగా రనౌట్‌ అయ్యాడు. మరి ఈ రనౌట్‌ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 08, 2024 | 12:45 PMUpdated Jun 08, 2024 | 12:45 PM
వీడియో: ఇలా కూడా అవుట్‌ అవుతారా? క్రికెట్‌ చరిత్రలోనే మోస్ట్‌ అన్‌లక్కీ ఫెలో రుతురాజ్‌!

ఐపీఎల్‌ 2024లో మెరుపులు మెరిపించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. టీ20 వరల​్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదని నిరాశ చెందకుండా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ఆడుతున్నాడు. పుణేరి బప్పా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ తాజాగా ఓ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. ఇలాంటి రనౌట్‌ను బహుషా ఈ మధ్య కాలంలో ఏ ఫార్మాట్‌ క్రికెట్‌లోనూ చూసి ఉండరు. బాల్‌ వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి కాకముందే.. క్రీజ్‌లోకి సులువుగా చేరిపోవాల్సిన గైక్వాడ్‌.. దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు. అతను రనౌట్‌ అయిన తీరు చూస్తే.. ఎవరు కూడా అది రనౌట్‌ అంటే నమ్మలేరు. ఇంతకీ రుతురాజ్‌ ఎలా అవుట్‌ అయ్యాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా శుక్రవారం పుణేరి బప్పా, రత్నగిరి జెట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో పుణేరి బప్పా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు మంచి స్టార్ట్‌ అందించారు. రెండు వికెట్లు పడిన తర్వాత.. పుణేరి బప్పా కెప్టెన్‌ రుతురాజ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 29 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి షాట్‌ ఆడి.. ఒక పరుగు పూర్తి చేశాడు. రెండో రన్‌ కోసం కూడా వెళ్లాడు. నిజానికి రెండో రన్‌ కూడా చాలా ఈజీగా పూర్తి కావాల్సిందే. కానీ.. సరిగ్గా క్రీజ్‌లో బ్యాట్‌ పెట్టే సమయానికి రుతురాజ్‌ బ్యాట్‌ క్రీజ్‌ లైన్‌కి ముందు స్ట్రక్‌ అయిపోయింది. బ్యాట్‌ను డ్రాగ్‌ చేసే క్రమంలో బ్యాట్‌ స్ట్రక్‌ అవ్వడంతో రుతురాజ్‌ బ్యాట్‌ క్రీజ్‌లో పెట్టేలేకపోయాడు.

బ్యాట్ స్ట్రక్‌ కావడంతో రన్నింగ్‌లో ఉన్న రుతురాజ్‌ చేతి నుంచి బ్యాట్‌ చేజారిపోయింది. అప్పటికే వికెట్‌ కీపర్‌ బాల్‌ అందుకుని.. వికెట్లను గిరాటేశాడు. బ్యాట్‌ క్రీజ్‌లోకి రాలేదు కనుక.. రుతురాజ్‌ కాలు క్రీజ్‌లోకి పడే సమయానికి కీపర్‌ రనౌట్‌ చేసేశాడు. రుతురాజ్‌ బ్యాట్‌ క్రీజ్‌లైన్‌కి ముందు బ్యాట్‌ స్ట్రక్‌ కాకపోయి ఉంటే చాలా ఈజీగా రుతురాజ్‌ క్రీజ్‌లోకి వెళ్లిపోయేవాడు. దురదృష్టవశాత్తు ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో రుతురాజ్‌ పెవిలియన్‌ చేరాడు. పైగా ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ టీమ్‌ పుణేరి బప్పా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణేరి 19.5 ఓవర్లలో 144 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈ టార్గెట్‌ను రత్నగిరి జెట్స్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి