iDreamPost
android-app
ios-app

IPL 2024: ఇది మామూలు రికార్డు కాదు.. కోహ్లీ, రోహిత్ లకు సాధ్యం కానిది గైక్వాడ్ సాధించాడు!

  • Published Apr 15, 2024 | 11:04 AM Updated Updated Apr 15, 2024 | 11:04 AM

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకే సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకే సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: ఇది మామూలు రికార్డు కాదు.. కోహ్లీ, రోహిత్ లకు సాధ్యం కానిది గైక్వాడ్ సాధించాడు!

టీమిండియా యంగ్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఐపీఎల్ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా రాణిస్తూ.. టీమ్ కు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఇక తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలకమైన 69 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఈ రికార్డు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాలేదు. ఇంతకీ ఆ రేర్ ఫీట్ ఏంటంటే?

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముంబైతో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 69 రన్స్ చేసిన రుతురాజ్ ఈ రేర్ ఫీట్ ను సాధించాడు. ఇతడు కేవలం 57 ఇన్నింగ్స్ ల్లోనే 2,021 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటుగా 16 ఫిఫ్టీలు ఉన్నాయి. ఈ ఘనత రోహిత్, విరాట్ కోహ్లీలు కూడా సాధించలేకపోయారు. అలాంటిది ఈ యువ క్రికెటర్ సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ఇక ఓవరాల్ గా ఐపీఎల్  చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా గైక్వాడ్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, షాన్ మార్ష్ ఉన్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 224 రన్స్ చేశాడు. ధోని సలహాలు, సూచనలు పాటిస్తూ.. చెన్నైని విజయపథంలో నడిపిస్తున్నాడు రుతురాజ్. సీఎస్కే టీమ్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సాధ్యం కాని రికార్డును సాధించిన రుతురాజ్ గైక్వాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.