ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ ఫన్నీ క్యాచ్ నమోదు అయ్యింది. తాజాగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ టోర్నీలో ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ చూస్తే మీకు నవ్వాగదు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ ఫన్నీ క్యాచ్ నమోదు అయ్యింది. తాజాగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ టోర్నీలో ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ చూస్తే మీకు నవ్వాగదు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రపంచ క్రికెట్ లోకి టీ20 ఫార్మాట్ ఎంట్రీ ఇచ్చాక ఎన్నో మార్పులు వచ్చాయి. గ్రౌండ్ లోనూ ప్లేయర్ల వేగం పెగడంతో పాటుగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లాంటి అన్ని విషయాల్లో వేగం పెరిగింది. దీంతో క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలు నమోదౌతున్నాయి. తాజాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ ఫన్నీ క్యాచ్ నమోదు అయ్యింది. తాజాగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ టోర్నీలో ఓ ఫీల్డర్ అందుకున్న క్యాచ్ చూస్తే మీకు నవ్వాగదు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రికెట్ మ్యాచ్ ల్లో కొన్ని కొన్ని సార్లు అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు ఫన్నీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి క్యాచ్ లు పట్టడం, డైవ్ చేస్తూ.. బాల్ ను అందుకోవడం చూసి ఉన్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోయే క్యాచ్ మీరు ఇంత వరకు చూసుండరు. ఆ వివరాల్లోకి వెళితే.. లెజెండ్స్ లీగ్ లో భాగంగా తాజాగా సదరన్ సూపర్ స్టార్స్ వర్సెస్ ఇండియన్ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నమోదైన ఓ క్యాచ్ క్రికెట్ లవర్స్ ను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. ఆశ్చర్యానికి సైతం గురిచేస్తోంది. క్యాపిటల్స్ బౌలర్ ఉడానా వేసిన ఈ ఓవర్ లో సదరన్ సూపర్ స్టార్ బ్యాటర్ మునవీరా ఓ భారీ షాట్ కొట్టాడు.
అయితే ఆ బాల్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో.. బంతి అమాంతం గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ లో ఫీల్డింగ్ చేస్తున్న సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ రస్టీ థెరోన్ బాల్ ను అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బాల్ అనూహ్యంగా రెండు చేతుల మధ్యలో నుంచి జారింది. బాల్ కాస్తా చెప్పుకోలేని భాగంలో తాకి.. బౌన్స్ అయ్యింది. దీంతో బాల్ ను ఒడిసిపట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఈ క్యాచ్ ను ‘క్యాచ్ ఆఫ్ ది సెంచరీ’ అని కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు మాత్రం బాల్ గ్రౌండ్ ను తాకకుండా అలా ఎలా బౌన్స్ అయ్యిందని, ఇది సైన్స్ కే అంతుచిక్కని దృశ్యమని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది నాటౌట్ అంటూ మరికొందరు వాదిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది. జట్టులో డి సిల్వా 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ క్యాపిటల్స్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రికార్డో పావెల్ 57 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 100 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మరి ఈ విచిత్ర క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Have you seen anything like this? Keep watching to see exactly how Rusty Theron held onto this catch 😅
(via @LLCT20) #LLCT20 #LLCOnStar pic.twitter.com/bm2943yjn0
— ESPNcricinfo (@ESPNcricinfo) November 25, 2023