iDreamPost

Rovman Powell: 18 కోట్ల బౌలర్ ను చితక్కొట్టిన విండీస్ ప్లేయర్! ఒకే ఓవర్ లో ఏకంగా..

ఐపీఎల్ లో 18 కోట్లకు పైగా రికార్డు ధర పలికిన బౌలర్ ను చితక్కొట్టాడు విండీస్ ప్లేయర్. ఒకే ఓవర్ లో రికార్డు స్థాయిలో పరుగులు పిండుకున్నాడు.

ఐపీఎల్ లో 18 కోట్లకు పైగా రికార్డు ధర పలికిన బౌలర్ ను చితక్కొట్టాడు విండీస్ ప్లేయర్. ఒకే ఓవర్ లో రికార్డు స్థాయిలో పరుగులు పిండుకున్నాడు.

Rovman Powell: 18 కోట్ల బౌలర్ ను చితక్కొట్టిన విండీస్ ప్లేయర్! ఒకే ఓవర్ లో ఏకంగా..

ఐపీఎల్ 2023లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అతడిని పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఈ రికార్డు బద్దలైన సంగతి తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టీ20లో విండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. సామ్ కర్రన్ కు చుక్కలు చూపిస్తూ.. రికార్డు స్థాయిలో పరుగులు పిండుకున్నాడు.

ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ సృష్టించిన విధ్వంసానికి బలైయ్యాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్. ఈ మ్యాచ్ లో సామ్ కర్రన్ వేసిన 16వ ఓవర్ లో తన విశ్వరూపం చూపాడు పావెల్. తొలి బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనక నుంచి బౌండరీ వెళ్లింది. ఇక ఆ తర్వాత రెండు బంతులను ఈ విండీస్ బ్యాటర్ సిక్సర్లు గా మలిచాడు. అనంతరం కాస్త ఒత్తిడికి గురైన కర్రన్ నెక్ట్స్ బాల్ ను వైడ్ గా వేశాడు. అయితే తన ఏకాగ్రత ఏ మాత్రం కోల్పోని పావెల్ తర్వాతి రెండు బాల్స్ ను మరో రెండు సిక్సర్లుగా మలిచాడు. దీంతో గ్రౌండ్ మెుత్తం హోరెత్తింది.

rovman powell superb batting

ఈ క్రమంలోనే తన అర్దశతకాన్ని పూర్తి చేసుకున్నాడు విండీస్ కెప్టెన్. కేవలం 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు పూర్తి చేసి.. ఈ ఓవర్ చివరి బంతికి హ్యారీ బ్రూక్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు చేరాడు. ఇక సామ్ కర్రన్ వేసిన ఈ ఓవర్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో సహా మెుత్తం 30 పరుగులు పిండుకున్నాడు పావెల్. దీంతో నిర్ణీత 20 ఓవర్ విండీస్ 177 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ విఫలం అయ్యింది. దీంతో 18 కోట్ల బౌలర్ ను భలే చితక్కొట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. తాాజాగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో పావెల్ ను రూ. 7.40  కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మరి పావెల్ విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి