SNP
Rory Burns, Will Jacks, Vitality T20 Blast: క్రికెట్‌లో తాజాగా ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది. అది చూస్తే.. గల్లీ క్రికెట్‌లో ఇంతకంటే బెటర్‌గా ఆడతారు కదా అని అనిపిస్తుంది. ఆ ఫన్నీ ఇన్నిడెంట్ గురించి ఇప్పుడు చూద్దాం..
Rory Burns, Will Jacks, Vitality T20 Blast: క్రికెట్‌లో తాజాగా ఓ ఫన్నీ ఇన్నిడెంట్ జరిగింది. అది చూస్తే.. గల్లీ క్రికెట్‌లో ఇంతకంటే బెటర్‌గా ఆడతారు కదా అని అనిపిస్తుంది. ఆ ఫన్నీ ఇన్నిడెంట్ గురించి ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్.. ఎంత ఉత్కఠభరితంగా సాగుతుందో, కొన్ని సార్లు అంతకు మించి ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతాయి. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 బ్లాస్ట్ టోర్నీలో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. సింపుల్ రనౌట్ చేయాల్సిన చోట.. బాల్‌ను మిస్ చేసి.. నవ్వుల పాలయ్యాడు. ఈ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ఫన్నీ ఘటనలు పాకిస్థాన్ క్రికెట్‌లోనే అనుకుంటే.. ఇక్కడ అంతకు మించి ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు జోకులు పేలుసున్నారు.
సర్రే, డర్హామ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ రోరే బర్న్స్ ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌కు కారణం అయ్యాడు. సర్రే బౌలర్ టామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో వైడ్‌యార్కర్‌ను డర్హామ్ బ్యాటర్ డీ లీడే కవర్స్‌లోకి ఆడాడు. ఆ బాల్‌ను విల్ జాక్స్ అద్భుతంగా డైవ్ చేస్తూ.. బాల్‌ను ఆపాడు. ఆ లోపు బ్యాటర్ లీ డీడే రన్ కోసం ఆఫ్ పిచ్‌కు వెళ్లిపోయాడు. కానీ, నాన్ స్ట్రైకర్‌లో ఉన్న బ్యాటర్, విల్ జాక్స బాల్ ఆపడాన్ని చూసి.. రన్ కోసం రాకుండా అక్కడే ఆగిపోయాడు. దీంతో.. బాల్ అందుకున్న జాక్స్ వికెట్ వైపు త్రో వేశాడు.
బాల్ సర్గిగా అందుకోలేకపోయిన వికెట్ కీపర్ రోరే బర్న్స్.. చేతుల్లో బాల్ లేకుండానే వికెట్లను గిరాటేశాడు. అది గమనించి.. కొద్ది దూరంలో పడిన బాల్‌ను తీసుకొచ్చి మళ్లీ రనౌట్ చేసే లోపు.. డీ లీడే తిరిగి క్రీజ్‌లోకి వచ్చేశాడు. ఇది చూసిన వాళ్లంతా రోరే బర్న్స్ చేసిన పనికి షాక్ అయ్యారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన సర్రే జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల చేసి గెలిచింది.ప డొమినిక్ 67 పరుగులతో అదరగొట్టాడు. అలాగే సామ్ కరన్ సైతం 52 పరుగులతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో రోరే బర్న్స్ రనౌట్ మిస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
HOW DID HE FUMBLE THAT?! 😬
All Rory Burns can do is laugh… pic.twitter.com/PCjCEdxf3q
— Vitality Blast (@VitalityBlast) September 3, 2024