iDreamPost
android-app
ios-app

Nicholas Pooran: పూనకాలు తెప్పించిన పూరన్.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్!

  • Published Sep 23, 2024 | 10:10 AM Updated Updated Sep 23, 2024 | 10:10 AM

Nicholas Pooran, Caribbean Premier League 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నికోలస్ పూరన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. తాజాగా SKN పేట్రియాట్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు.

Nicholas Pooran, Caribbean Premier League 2024: కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నికోలస్ పూరన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. తాజాగా SKN పేట్రియాట్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు.

Nicholas Pooran: పూనకాలు తెప్పించిన పూరన్.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్!

ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నికోలస్ పూరన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. తన బ్యాట్ పవర్ ఏంటో మరోసారి బౌలర్లకు రుచి చూపించాడు. ప్రత్యర్థి పై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. మెరుపు బ్యాటింగ్ చేశాడు. దాంతో ఈ టోర్నీలో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక పూరన్ దాటికి 194 పరుగుల లక్ష్యం కూడా చిన్నదైపోయింది. తన బ్యాటింగ్ తో పూనకాలు తెప్పించాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

నికోలస్ పూరన్.. ప్రపంచ క్రికెట్ లో విధ్వంసానికి మరో పేరు. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో పూరన్ రెచ్చిపోయే విధానం చూస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఈ లీగ్ లో భాగంగా తాజాగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. జట్టులో ఆండ్రీ ఫ్లెచర్ 61 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 93 రన్స్ చేశాడు. అతడికి అండగా.. కైల్ మేయర్స్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 రన్స్ తో చెలరేగారు.

అనంతరం 194 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. నికోలస్ పూరన్ మెరుపు బ్యాటింగ్ తో 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. పూరన్ ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇతడు కేవలం 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూనకాలు తెప్పించేలా బ్యాటింగ్ చేసి జట్టుకు అద్బుత విజయాన్ని అందించాడు. అతడికి తోడు జేసన్ రాయ్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 రన్స్ చేశాడు. కాగా.. ఈ విజయానికి ముందే నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఈ టీమ్ తో పాటుగా సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్,  బార్బడోస్ రాయల్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరాయి. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు అక్టోబర్ 1, 2, 4 తేదీల్లో జరగనున్నాయి. అక్టోబర్ 6న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి ఫోర్లు, సిక్సర్లతో నికోలస్ పూరన్ చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.