iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్సీ పోయినట్టేనా? జైషా వ్యాఖ్యలకు అర్థమేంటి?

  • Published Dec 11, 2023 | 12:38 PM Updated Updated Dec 12, 2023 | 1:37 PM

ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, చాలా రోజులుగా టీ20 క్రికెట్‌కు దూరంగా ఉంటుండంతో హార్ధిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. మళ్లీ రోహిత్‌ టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జైషా చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, చాలా రోజులుగా టీ20 క్రికెట్‌కు దూరంగా ఉంటుండంతో హార్ధిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే.. మళ్లీ రోహిత్‌ టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో జైషా చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

  • Published Dec 11, 2023 | 12:38 PMUpdated Dec 12, 2023 | 1:37 PM
Rohit Sharma: రోహిత్‌ శర్మ టీ20 కెప్టెన్సీ పోయినట్టేనా? జైషా వ్యాఖ్యలకు అర్థమేంటి?

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 తర్వాత ఇండియన్‌ క్రికెట్‌లో అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను అన్ని ఫార్మాట్లలో కొనసాగిస్తారా? లేదా?, రోహిత్‌, కోహ్లీ కెరీర్‌ను ఏ ఫార్మాట్లలో కంటిన్యూ చేస్తారు? టీ20 టీమ్‌కు కెప్టెన్‌ను మారుస్తారా? కోహ్లీని టెస్ట్‌, వన్డేలకు పరిమితం చేసి టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉంచుతారా? ఇలా అనేక అనుమానాలు క్రికెట్‌ అభిమానుల బుర్రను గిర్రున తిప్పుతున్నాయి. వరల్డ్‌ కప్‌ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అలాగే ప్రస్తుతం సౌతాఫ్రికాతో మొదలైన సిరీస్‌లో రోహిత్‌ శర్మ, కోహ్లీ ఆడకపోవడం, మొత్తం యువ క్రికెటర్లే ఉండటం, మరో ఆరునెలల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ఉండటంతో ఈ అనుమానలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. జైషా ఇచ్చిన స్టేట్‌ ప్రకారం.. టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు కాలం చెల్లినట్లే అని అనిపిస్తోందంటూ క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ జైషా ఏం చెప్పారంటే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు ఇంకా చాలా సమయం ఉంది. అందుకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు ఐపీఎల్‌ కూడా ఉన్నందున పూర్తిగా పరిశీలించి మంచి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికైతే భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023కి ముందు కేవలం వన్డేల ఫోకస్‌ పెట్టేందుకు రోహిత్‌ శర్మ టీ20లు పెద్దగా ఆడలేదు.

rohit sharma good bye for captancy

పైగా అతని వయసు కూడా ఎక్కువగానే ఉంది. అగ్రెసివ్‌ క్రికెట్‌ ఆడుతున్నా.. టీ20ల్లో యంగ్‌ బ్లడ్‌ ఉండాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్‌పై తుది నిర్ణయం రోహిత్‌కే వదిలేసినట్లు తెలుస్తుంది. టీ20ల్లో కొనసాగాలా? వద్దా? అనేది పూర్తిగా రోహిత్‌ ఇష్టానికే బోర్డు వదిలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆటగాడిగా కొనసాగినా.. కెప్టెన్‌గా ఉంటాడా లేడా అన్నది అనుమానం. రోహిత్‌ శర్మ టీ20లు ఆడని సమయంలో హార్ధిక్‌ పాండ్యా టీ20ల్లో టీమిండియాకు అనధికారిక రెగ్యులర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. మరి టీ20 వరల్డ్‌ కప్‌కు కూడా అతన్నే కెప్టెన్‌గా కొనసాగిస్తారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. పాండ్యా గాయంతో జట్టుకు దూరం కావడంతో.. సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి టీ20 వరల్డ్‌ కప్ కోసం కెప్టెన్‌గా ఎవరుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.