T20 World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ దూరం?

T20 World Cup: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ దూరం?

Rohit Sharma, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాక్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. అతను ఎందుకు దూరం అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, IND vs PAK, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధం అవుతున్న టీమిండియా భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాక్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. అతను ఎందుకు దూరం అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పాక్‌తో టీమిండియా తలపడనుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి తెలిసిందే.. ఇప్పుడు కూడా ఫ్యాన్స్‌ అదే ఇంట్రెస్ట్‌ను కనబరుస్తున్నారు. భారత కాలమాన ప్రకారం.. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా మ్యాచ్‌కి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అదేంటంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం అవుతాడని సమాచారం.

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇంతకీ రోహిత్‌ శర్మ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు దూరం అవుతాడు అనే ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి అంటే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడిన రోహిత్‌ శర్మ.. ఒక్కసారి వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కాగానే తన అసలు సత్తా చాటాడు. వందలోపు టార్గెట్‌ను ఛేజ్‌ చేసే క్రమంలో ఏకంగా హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అయితే.. అంత బాగా ఆడుతున్న టైమ్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు నుంచి రోహిత్‌ శర్మ చేయి నొప్పితో బాధపడుతున్నట్లు మ్యాచ్‌ తర్వాత వెల్లడించాడు. మరి ఆ నొప్పి తగ్గిందా? లేదా? అనే విషయంపై ఇప్పటి వరకు టీమిండియా నుంచి ఎలాంటి ఆప్డేట్‌ రాలేదు. అలాగే ఐర్లాండ్‌తో మ్యాచ్‌ తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కూడా రోహిత్‌కు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. అందుకే క్రికెట్‌ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇప్పటికే టీమిండియా ఓపెనింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతుంది. రెగ్యులర్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లో లేకపోవడంతో.. వామప్‌ మ్యాచ్‌లో సంజు శాంసన్‌, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని ఓపెనర్లుగా దింపింది టీమిండియా. వాళ్లిద్దరు విఫలం అయ్యారు. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ కూడా జట్టుకు దూరం అయితే.. ఎలా అని ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, రోహిత్‌ శర్మ పాక్‌తో మ్యాచ్‌తో బరిలోకి దిగుతాడు అని కూడా కొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments