iDreamPost
android-app
ios-app

టీమిండియాకు షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం! ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు..

  • Author Soma Sekhar Published - 12:43 PM, Sun - 29 October 23

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జట్టు స్టార్ ప్లేయర్ కు గాయం అయినట్లు సమాచారం.

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జట్టు స్టార్ ప్లేయర్ కు గాయం అయినట్లు సమాచారం.

  • Author Soma Sekhar Published - 12:43 PM, Sun - 29 October 23
టీమిండియాకు షాక్.. స్టార్ ప్లేయర్ కు గాయం! ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు..

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు గాయాలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో స్టార్ ప్లేయర్ గాయపడినట్లు సమాచారం. లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కొన్ని ఇంగ్లీష్ మీడియా వెబ్ సైట్స్ కథనాల ప్రకారం టీమిండియా స్టార్ ప్లేయర్ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న విషయం ఇంకా తెలీయరాలేదు. ప్రాక్టీస్ సందర్భంగా ఈ స్టార్ ప్లేయర్ గాయపడినట్లు సమాచారం. మరి ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వరల్డ్ కప్ లో వరుస విజయాలతో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న టీమిండియాకు గాయాలు షాకిస్తున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో టీమిండియా ప్లేయర్ కు గాయం అయినట్లు సమాచారం. లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్వల్పంగా గాయమైనట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా రోహిత్ మణికట్టుకు గాయం అయినట్లు సమాచారం.

దీంతో అతడు ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్నది అనుమానంగా మారింది. అయితే రోహిత్ గాయంపై బీసీసీఐ నుంచి గానీ టీమ్ మేనేజ్ మెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ రోహిత్ గాయం నిజమైతే.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు సారథిగా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తాడు. రోహిత్ విశ్రాంతి తీసుకుంటే.. అతడి స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతడు గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఈ వార్త టీమిండియా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss