ఛాంపియన్స్‌కు BCCI ఇచ్చిన 125 కోట్లలో రోహిత్‌, కోహ్లీకి ఎంత వచ్చిందో తెలుసా?

Rohit Sharma, Virat Kohli, BCCI, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచినందుకు భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కోహ్లీ, రోహిత్‌కి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Virat Kohli, BCCI, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచినందుకు భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కోహ్లీ, రోహిత్‌కి ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల కలను నిజం చేస్తూ.. ఇటీవల రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని మెన్‌ ఇన్‌ బ్లూ టీమ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ను సాధించిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత భారత జట్టు రెండోసారి టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడంతో ప్రతి భారతీయుడు హృదయం ఉప్పొంగింది. యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో ఫైనల్‌లో సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును ఓడించి.. రోహిత్‌ సేన విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. ఇంత అద్భుతమైన విజయం సాధించి.. ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానాను ప్రకటించిన విషయం తెలిసిందే.

వరల్డ్‌ కప్‌ గెలిచి.. ఈ నెల 4న భారత్‌కు తిరిగొచ్చిన రోహిత్‌ సేనను వాంఖడే స్టేడియంలో ఘనంగా సన్మానించి.. ఏకంగా రూ.125 కోట్లను బహుమతిగా అందజేసింది బీసీసీఐ. అయితే.. ఈ భారీ మొత్తంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అలాగే హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఎంత వాటా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం రూ.125 కోట్లలో జట్టులోని 15 మంది ఆటగాళ్లకు రూ.5 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. అలాగే హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు సైతం ఆటగాళ్లతో సమానంగా రూ.5 కోట్లు ఇవ్వనున్నారు.

ఇక ఆటగాళ్లు కాకుండా.. కోచింగ్‌ స్టాఫ్‌, బ్యాక్‌రూమ్‌ స్టాఫ్‌, రిజర్వ్‌ ప్లేయర్లకు కూడా ఈ నగదు బహుమానంలో వాటా ఇవ్వనున్నారు. అలాగే ఛాంపియన్‌ టీమ్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లకు కూడా ఇందులో కొంత మొత్తం ఇస్తున్నారు. ద్రవిడ్‌ కాకుండా ఇతర కోచింగ్‌ స్టాఫ్‌కు ఒక్కొక్కరికి రూ.2.5 కోట్ల చొప్పు, బ్యాక్‌ రూమ్‌ స్టాఫ్‌కు తలో రూ.2 కోట్లు, సెలెక్షన్‌ కమిటీ సభ్యులు, రిజర్వ్‌ ప్లేయర్లకు రూ.కోటి చొప్పున అందిస్తున్నారు. ఇలా రూ.125 కోట్లను అందరికి ఎంతో కొంత వచ్చేలా పంచారు. అయితే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఇవ్వడంపై క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Show comments