SNP
Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్ 2024 కోసం అంతా రెడీ అవుతుంది. టీమ్స్ కూడా తన ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటికే ప్రాక్టీస్‌తో ఆటగాళ్లు కూడా బీజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రోహిత్ వర్సెస్ పాండ్యా మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్ 2024 కోసం అంతా రెడీ అవుతుంది. టీమ్స్ కూడా తన ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటికే ప్రాక్టీస్‌తో ఆటగాళ్లు కూడా బీజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రోహిత్ వర్సెస్ పాండ్యా మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఐపీఎల్‌కి ముందు ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ టీమ్‌కు ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆ బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పగించింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. చాలా మంది రోహిత్ ఫ్యాన్స్ ముంబైని అన్‌ఫాలో చేశారు.
కెప్టెన్‌గా టీమ్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని, డబ్బుల కోసం టీమ్‌ను వదిలి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి, మళ్లీ డబ్బుల కోసమే ముంబై టీమ్‌లోకి తిరిగి వచ్చిన హార్ధిక్ పాండ్యాకు ఎలా కెప్టెన్సీ అప్పగిస్తారని క్రికెట్ అభిమానులు కూడా ముంబై మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ కూడా కోపంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ ఆడటం లేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన రోహిత్ శర్మ వెంటనే దాన్ని డిలీట్ చేసి.. ప్రస్తుతం ముంబై క్యాంప్‌కు చేరుకున్నాడు. అయిష్టంగానే రోహిత్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆటగాళ్ల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు, అలాగే ప్రాక్టీస్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల మధ్య ఒక మ్యాచ్‌ను ప్లాన్ చేసింది. ఇందులో ఒక టీమ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా, మరో టీమ్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటారని సమాచారం. ఈ మ్యాచ్ చూసేందుకు దాదాపు 3 వేల మంది ప్రేక్షకులను కూడా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే రోహిత్, పాండ్యా మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత హీట్ పెంచనుంది. మరి రోహిత్ వర్సెస్ పాండ్యా మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Practice aur match, dono mein कडक timing! 🤩#OneFamily #PBKSvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ishankishan51 pic.twitter.com/WZXbITvVnW
— Mumbai Indians (@mipaltan) May 3, 2023