iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మకు రూ.50 కోట్లు? హిట్‌మ్యాన్ కోసం 2 IPL ఫ్రాంచైజీల ఫైట్!

  • Published Aug 24, 2024 | 12:45 PM Updated Updated Aug 24, 2024 | 12:45 PM

Rohit Sharma, IPL Auction 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాలెంట్ గురించి తెలిసిందే. అతడి బ్యాటింగ్, కెప్టెన్సీ ఎబిలిటీస్, ఎక్స్ పీరియెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అతడి కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.

Rohit Sharma, IPL Auction 2025: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాలెంట్ గురించి తెలిసిందే. అతడి బ్యాటింగ్, కెప్టెన్సీ ఎబిలిటీస్, ఎక్స్ పీరియెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే అతడి కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.

  • Published Aug 24, 2024 | 12:45 PMUpdated Aug 24, 2024 | 12:45 PM
రోహిత్ శర్మకు రూ.50 కోట్లు? హిట్‌మ్యాన్ కోసం 2 IPL ఫ్రాంచైజీల ఫైట్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు ప్రస్తుత క్రికెట్ లో చాలా అరుదు. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ కెప్టెన్సీతో అతడు టీమ్ విజయాల్లో పోషించే పాత్రను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అంత సుదీర్ఘ అనుభవం కలిగిన ప్లేయర్, అటాకింగ్ బ్యాటర్, కెప్టెన్ దొరికితే ఇక ఆ టీమ్ కు తిరుగే ఉండదు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే హిట్ మ్యాన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. వేలంలోకి వస్తే చాలు అతడి కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి. అతడి కోసం నలుగురు స్టార్ ప్లేయర్లకు పెట్టేంత మొత్తాన్ని బిడ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. రెండు ఫ్రాంచైజీలు అయితే హిట్ మ్యాన్ కోసం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని సమాచారం. రోహిత్ కోసం పోటీపడుతున్న ఫ్రాంచైజీలు ఏవి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్ మ్యాన్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా ఇవి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. అతడి కోసం రూ.50 కోట్లను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాయట. ఆక్షన్ లోకి వస్తే చాలు.. భారత కెప్టెనే లక్ష్యంగా ఈ రెండు ఫ్రాంచైజీలు ముందుకు వెళ్లనున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని జట్ల లిస్ట్ లో పంజాబ్, ఢిల్లీ ఉన్నాయి. సరైన ప్లేయర్లను టీమ్ లోకి తీసుకోకపోవడం, ఉన్నవాళ్లు అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడంతో పాటు మంచి కెప్టెన్ లేకపోవడం ఆ ఫ్రాంచైజీలను దెబ్బతీసింది. అందుకే హిట్ మ్యాన్ ను తీసుకోవాలని అనుకుంటున్నాయట. రోహిత్ వస్తే తమ దశ మారిపోతుందని భావిస్తున్నాయట.

Rohith Sharm

రోహిత్ వస్తే అంతా సెట్ అవుతుందని, కప్పు కల కూడా తీరుతుంది, సేమ్ టైమ్ టీమ్ బ్రాండ్, క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటాయని ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కెప్టెన్సీ కాంట్రవర్సీ కారణంగా ముంబైని రోహిత్ వీడటం ఖాయంగా మారింది. తాను తయరు చేసిన హార్దిక్ పాండ్యా లాంటి జూనియర్ కెప్టెన్సీలో ఆడటం కంటే తానే వేరే టీమ్ కు సారథిగా వెళ్లి ఆడటం మంచిదనే అభిప్రాయంతో హిట్ మ్యాన్ ఉన్నట్లు సమాచారం. ముంబై ఫ్రాంచైజీ వివాదాన్ని సద్దుమణిగేలా చేసి.. అతడ్ని రీటెయిన్ చేసుకోవడం, టీమ్ తోనే ఉండేలా చేస్తే ఓకే. కానీ వేలంలోకి వచ్చాడా పాత రికార్డులకు రోహిత్ పాతర వేయడం పక్కాగా కనిపిస్తోంది. శాలరీ పర్స్ పెంచుతున్నారు కాబట్టి రూ.35 నుంచి రూ.50 కోట్ల ధరకు హిట్ మ్యాన్ అమ్ముడుపోవడం ఖాయమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.