iDreamPost
android-app
ios-app

DRS కోసం జడేజాపై రోహిత్‌ పంచ్‌లు! వైరల్ అవుతున్న ఆ డైలాగ్!

  • Published Nov 06, 2023 | 4:24 PM Updated Updated Nov 06, 2023 | 4:24 PM

వరల్డ్‌ కప్‌లో భారత జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. బ్యాటర్‌గా జట్టుకు మంచి స్టార్ట్స్‌ ఇస్తూ.. కెప్టెన్‌గా మంచి నిర్ణయాలతో సక్సెస్‌ అవుతున్నాడు. తాజాగా ఓ డీఆర్‌ఎస్‌ విషయంలో కూడా రోహిత్‌ శర్మ హైలెట్‌ అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో భారత జట్టును కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. బ్యాటర్‌గా జట్టుకు మంచి స్టార్ట్స్‌ ఇస్తూ.. కెప్టెన్‌గా మంచి నిర్ణయాలతో సక్సెస్‌ అవుతున్నాడు. తాజాగా ఓ డీఆర్‌ఎస్‌ విషయంలో కూడా రోహిత్‌ శర్మ హైలెట్‌ అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 06, 2023 | 4:24 PMUpdated Nov 06, 2023 | 4:24 PM
DRS కోసం జడేజాపై రోహిత్‌ పంచ్‌లు! వైరల్ అవుతున్న ఆ డైలాగ్!

టీమిండియా స్పీడ్‌ ముందు సౌతాఫ్రికా కూడా నిలువలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ పెద్ద పెద్ద టీమ్స్‌ను చిత్తు చేసిన టీమిండియా.. కాస్తో కూస్తో సౌతాఫ్రికా పోటీ ఇస్తుందేమో అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, బ్యాటింగ్‌ చేసేందుకు కష్టంగా ఉన్న పిచ్‌పై టీమిండియాకు 326 పరుగులు సమర్పించుకున్న సౌతాఫ్రికా.. బ్యాటింగ్‌లో మాత్రం కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో భారీ భారీ స్కోర్లు, సెంచరీల మీద సెంచరీలు నమోదు చేసి ప్రొటీస్‌ బ్యాటర్లు టీమిండియా బౌలింగ్‌ ఎటాక్‌ ముందు తలవంచేశారు. అసలే ఛేజింగ్‌లో ఛోకర్స్‌గా పేరున్న సౌతాఫ్రికాకు దమ్మున్న బౌలింగ్‌ ఎటాక్‌ ఎదురుపడటంతో.. హేమాహేమీ బ్యాటర్లు సైతం చేతులెత్తేశారు. దీంతో.. భారత్‌కు 243 పరుగుల తేదాతో భారీ విజయం దక్కింది.

ఇక మ్యాచ్‌లో జడేజా అద్భుతం చేశారు. ఏకంగా 5 వికెట్ల హల్‌ సాధించి, 2011లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సాధించిన అరుదైన రికార్డును సమం చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌ 5వ బంతికి షాట్‌ ఆడబోయాడు క్లాసెన్‌. కానీ అది కాస్త క్లాసెన్‌ ప్యాడ్లకు తాకింది. దీంతో జడేజా ఎంతో కాన్ఫిడెన్స్‌గా అపీల్‌ చేశాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. జడేజా మాత్రం ఎంతో కాన్ఫిడెన్స్‌లో రివ్యూ తీసుకోవాలని వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లాడు.

అక్కడే ఉన్న రోహిత్‌ శర్మ.. జడేజా, రాహుల్‌ మధ్య చర్చలు విన్నాడు. రాహుల్‌ మాత్రం డీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి సముఖంగా లేదు. బాల్‌ లెగ్‌ సైడ్‌ పడటంతో, పిచ్‌ ఇన్‌ లైన్‌లో ఉండకపోచ్చనే అనుమానం వ్యక్తం చేశాడు. కానీ, రోహిత్‌ శర్మ మాత్రం.. ‘ఉన్నది ఇతనొక్కడు బ్యాటర్‌.. రివ్యూ తీసుకుంటే ఏం పోతుందిలే’ అని జడేజాతో అంటూ డీఆర్‌ఎస్‌ కోరాడు. ఫలితం ఇండియాకు అనుకూలంగా వచ్చింది. దీంతో.. జడేజా, రోహిత్‌ శర్మ ఫుల్‌ హ్యాపీగా కనిపించారు. సాధారణంగా డీఆర్‌ఎస్‌ విషయంలో కేఎల్‌ రాహుల్‌ను ఎక్కువగా నమ్ముతున్న రోహిత్‌ శర్మ.. ఈ సారి మాత్రం అప్పటికే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికాకు క్లాసెన్‌ ఒక్కడే మంచి బ్యాటర్‌ ఉండటంతో, ఉన్న రెండు రివ్యూల్లో ఒకటి పోయినా పర్వాలేదని డేర్‌ చేసి డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. అదే ఫలితాన్ని ఇచ్చింది. మరి రోహిత్‌ శర్మ తెలివిగా తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.