Rohit Sharma: వీడియో: అసెంబ్లీలో స్పీచ్‌ అదరగొట్టిన రోహిత్‌ శర్మ! ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్‌ పక్కా..

Rohit Sharma, Maharashtra, Vidhan Sabha: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా అసెంబ్లీలో ప్రసంగించాడు. హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా మరాఠీలో మాట్లాడి రోహిత్‌ ప్రత్యేకతను చాటుకున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rohit Sharma, Maharashtra, Vidhan Sabha: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా అసెంబ్లీలో ప్రసంగించాడు. హిందీ, ఇంగ్లీష్‌లో కాకుండా మరాఠీలో మాట్లాడి రోహిత్‌ ప్రత్యేకతను చాటుకున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భారత్‌కు రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వదేశానికి వచ్చినప్పటి నుంచి ఫుల్‌ బిజీబిజీగా గడుపుతున్నాడు. వెస్టిండీస్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. తుపాన్‌ కారణంగా ఇండియాకు ఆలస్యంగా తిరిగిన వచ్చిన భారత జట్టు.. గురువారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. అప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా కెప్టెన్‌ రోహిత్‌ బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించాడు రోహిత్‌ శర్మ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆహ్వానం మేరకు సీఎంతో మర్యాద పూర్వంగా కలిసేందుకు వెళ్లిన రోహిత్‌ శర్మ.. అనంతరం ఆ రాష్ట్ర విధాన సభ(అసెంబ్లీ)లో ప్రసంగించాడు.

సాధారణంగా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడే రోహిత్‌ శర్మ.. అసెంబ్లీలో మాత్రం మరాఠీలో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు. ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలోని తమ స్థానాల్లో కూర్చోని ఉండగా.. టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన అనుభూతి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడటం లాంటి విషయాలపై రోహిత్‌ తన భావనలను వ్యక్త పరిచారు. రోహిత్‌ శర్మ మరాఠిలో మాట్లాడుతుంటే.. అసెంబ్లీ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. కొంతమంది అయితే.. ముంబైకా రాజా రోహిత్‌ శర్మ అంటూ స్లోగన్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. జూన్‌ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. అనంతరం ఢిల్లీ నుంచి ముంబై చేరుకుని.. విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆటగాళ్లకు బీసీసీఐ వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ముంబై వైపు చూసేలా మైరెన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే వరకు విక్టరీ పరేడ్‌ సాగింది. అలాగే ముంబై ఎయిర్‌ పోర్టులో భారత ఆటగాళ్లు ప్రయాణించిన విమానానికి వాటర్‌ సెల్యూట్‌ కూడా హైలెట్‌గా నిలిచింది. నిన్న మొత్తం ఇలా అద్భుత క్షణాలను ఆస్వాదించిన రోహిత్‌ శర్మ.. ఈ రోజు తన రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments