SNP
Rohit Sharma, Injury, IND vs IRE, T20 World Cup 2024: ఐర్లాండ్‌పై విజయంతో సంతోషంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు గుండె పగిలిపోయే వార్త చెప్పాడు రోహిత్ శర్మ. అందేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Injury, IND vs IRE, T20 World Cup 2024: ఐర్లాండ్‌పై విజయంతో సంతోషంలో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు గుండె పగిలిపోయే వార్త చెప్పాడు రోహిత్ శర్మ. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
పసికూన ఐర్లాండ్‌పై సునాయస విజయంతో టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీని అందుకుని.. వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 97 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఏకంగా హాఫ్ సెంచరీతో టార్గెట్‌ను చాలా ఈజీ చేసేశాడు. 37 బంతుల్లో 52 పరుగులు చేసి.. ఫామ్‌లోకి తిరగి వచ్చాడు. ఇలా రోహిత్ ఫామ్‌తో పాటు.. టీమిండియా విజయంతో వరల్డ్ కప్‌ను మొదలుపెట్టినా.. ఒక విషయం మాత్రం భారత క్రికెట్ అభిమానులను ఓ విషయం షాక్‌కు గురి చేసింది. అదేంటంటే.. రోహిత్ శర్మ గాయం.
భారత బ్యాటింగ్ లైనప్‌లో ఎంతో కీలకమైన బ్యాటర్ రోహిత్ శర్మ. అతను ఇచ్చే అద్భుతమైన స్టార్ట్‌తోనే టీమిండియా భారీ భారీ స్కోర్లు చేయగలదు. పైగా ఈ టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఫామ్ ఎంతో ముఖ్యం. అయితే.. తాజాగా రోహిత్ శర్మ చేసిన ప్రకటన క్రికెట్ అభిమానుల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అదేంటంటే.. తనకు గాయం అయినట్లు స్వయంగా రోహిత్ శర్మనే వెల్లడించాడు. తాను చేయి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు రోహిత్ మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. టాస్ సమయంలోనూ ఈ విషయం గురించి మాట్లాడాడు. చేయి నొప్పితోనే బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీతో రాణించినా.. ఆ నొప్పి పెరిగి.. తర్వాత మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉంటాడా? ఉండడా? అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మ్యాచ్ మధ్యలో 52 పరుగులు చేసిన తర్వాత చేయి నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాడు. అయితే.. అది చిన్న నొప్పి మాత్రమే అని తెలుస్తోంది.
రోహిత్ శర్మతో పాటు రెగ్యులర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాల్సిన యశస్వి జైస్వాల్ ఫామ్‌లో లేడు. అతని స్థానంలో ఓపెనర్‌గా ఆడిద్దామని సంజు శాంసన్‌ను వామప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిస్తే అతను విఫలం అయ్యాడు. ఇలా కాదని ఏకంగా విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా బరిలోకి దింపితే.. అది కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే.. ఒక్క మ్యాచ్‌తో కోహ్లీని తీసిపారేయలేం కానీ, రోహిత్‌కు సరైన జోడీ సెట్ కావడం లేదు. ఇలాంటి టైమ్‌లో రోహిత్ శర్మ కూడా నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. అది కచ్చితంగా టీమిండియా గట్టి ఎదురుదెబ్బ కావొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా 9వ తేదీన పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరి ఈ మ్యాచ్ వరకు రోహిత్ పూర్తిగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రోహిత్ గాయం టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No major injuries for Team India captain Rohit Sharma 💙 pic.twitter.com/vL08Za08Y2
— CricTracker (@Cricketracker) June 5, 2024