iDreamPost
android-app
ios-app

విరాట్‌ కోహ్లీని విమర్శించేవారికి బుద్ధి చెప్పిన రోహిత్‌ శర్మ!

  • Published Nov 06, 2023 | 6:07 PM Updated Updated Nov 06, 2023 | 6:07 PM

వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా 8వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది భారత్‌. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. అయినా కూడా కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా 8వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం కోల్‌కత్తాలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది భారత్‌. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. అయినా కూడా కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

  • Published Nov 06, 2023 | 6:07 PMUpdated Nov 06, 2023 | 6:07 PM
విరాట్‌ కోహ్లీని విమర్శించేవారికి బుద్ధి చెప్పిన రోహిత్‌ శర్మ!

సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలోనే ఎంతో పటిష్టమైన జట్టుగా ఉన్న సౌతాఫ్రికాతో మ్యాచ్‌ అంటే.. టీమిండియాకు గట్టి పోటీ ఖాయం అని క్రికెట్‌ అభిమానులంతా భావించారు. కానీ, బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ప్రొటీస్‌ జట్టును పూర్తిగా డామినేట్‌ చేసిన రోహిత్‌ సేన.. భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయంలో తెలిసిందే. అయితే.. కోహ్లీ చాలా నిదానంగా బ్యాటింగ్‌ చేశాడని, రికార్డుల కోసం, సెంచరీ కోసమే స్లోగా బ్యాటింగ్‌ చేశాడని చాలా మంది సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు. రోహిత్‌ శర్మ ఆరంభంలో అంత బాగా వేగంగా ఆడి, మంచి స్టార్ట్‌ ఇచ్చిన తర్వాత కూడా కోహ్లీ వేగంగా ఆడకుండా.. కోహ్లీ సెంచరీ కోసమే అలా ఆడాడంటూ పేర్కొన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్టార్టింగ్‌లో చాలా వేగంగా పరుగులు అందించాడు. 24 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. అయితే.. రోహిత్‌ అవుటైనా తర్వాత కోహ్లీ కూడా వేగంగా ఆడాడు పవర్‌ ప్లేల్‌. తొలి 10 ఓవర్లలో టీమిండియా 90 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటం, సౌతాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేస్తుండటంతో.. కోహ్లీ జాగ్రత్తగా ఆడాడు. గిల్‌ కూడా అవుట్‌ కావడంతో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయ్యర్‌ సైతం ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడాడు. కేశవ్‌ ఓవర్లు అయిపోయిన తర్వాత అయ్యర్‌ వేగం పెంచాడు. కేఎల్‌ రాహుల్‌ సైతం పిచ్‌పై ఇబ్బంది పడ్డాడు.

చివరి ఓవర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 22, జడేజా 29 పరుగులు వేగంగా చేశారు. కానీ, కోహ్లీ మాత్రం ఆరంభం నుంచి సింగిల్స్‌, డబుల్స్‌పైనే ఫోకస్‌ చేశాడు. సెంచరీలో కోహ్లీ కొట్టింది కేవలం 10 ఫోర్లు మాత్రమే. 121 బంతుల్లో 101 రన్స్‌ చేశాడు. కానీ, కోహ్లీ ఆడన ఇన్నింగ్స్‌ మాత్రం ఎంతో విలువైంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అంత సులువుగా లేదు. దాదాపు బ్యాటర్లంతా ఇబ్బంది పడ్డారు. ఒక్క రోహిత్‌ శర్మ తప్పా. అది కూడా అను పవర్‌ ప్లేలో ఒక స్ట్రాటజీ ప్రకారం హిట్టింగ్‌ చేశాడు. అది ఇండియాకు కలిసొచ్చింది. కానీ చాలా మంది కోహ్లీ ఇన్నింగ్స్‌పై కామెంట్స్‌ చేశారు. వారందరికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన కౌంటర్‌ ఇచ్చాడు.

‘పిచ్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. అందుకే కోహ్లీ లాంటి ప్లేయర్‌ మాకు అవసరం’ అని మ్యాచ్‌ తర్వాత పేర్కొన్నాడు. నిజానికి కోహ్లీని నిదానంగా, ఇన్నింగ్స్‌ చివరి వరకు ఆడాలని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కోచ్‌, కెప్టెన్‌ నుంచే ఆదేశాలు వచ్చాయనే విషయం ఈ విమర్శించే వారికి తెలియదు. జట్టు అవసరాలకు తగ్గట్లు రోహిత్‌, కోహ్లీ వారి వారి రోల్స్‌తో ఆడుతున్నారు తప్పితే.. ఇందులో రోహిత్‌ స్వార్థం కానీ, కోహ్లీ స్వార్థం కానీ ఏమీ ఉండదు. పైగా రికార్డుల కోసం ఆడే అవసరం కోహ్లీకి లేదు. రికార్డులే అతనికి దాసోహం అవుతాయి. మరి కోహ్లీ హేటర్స్‌కి రోహిత్‌ శర్మ ఇచ్చిన కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.