iDreamPost
android-app
ios-app

Asia Cup: నేపాల్‌తో మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Published Sep 05, 2023 | 11:22 AM Updated Updated Sep 05, 2023 | 11:22 AM
  • Published Sep 05, 2023 | 11:22 AMUpdated Sep 05, 2023 | 11:22 AM
Asia Cup: నేపాల్‌తో మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసియా కప్‌ 2023లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుతు నేపాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తక్కువ స్కోర్‌కే నేపాల్‌ ఆలౌట్‌ అవుతుందని అంతా భావించినా.. నేపాల్‌ బ్యాటర్లు మంచి పోరాట పటిమ చూపించి.. 48.2 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి.. 230 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా 3, సిరాజ్‌ 3 వికెట్లతో రాణించారు.

ఇక టీమిండియా బ్యాటింగ్‌కు దిగి రెండు ఓవర్లు ఆడిందో లేదో వర్షం అంతరాయం కలిగించింది. చాలా సేపటి తర్వాత వర్షం ఆగడంతో.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టార్గెట్‌ను టీమిండియా ఓపెనర్లు 20.1 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఛేదించి, 10 వికెట్ల తేడా ఘన విజయం సాధించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సరిగా లేవనే చెప్పాలి. ఈ విషయాలపైనే మ్యాచ్‌ అనంతరం స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్‌ మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ నాకు నచ్చలేదు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ రిథమ్‌లోకి వచ్చిన తర్వాత పరుగులు చేయగలిగాను. ఫ్లిక్ స్వీప్ షాట్ ఆడాలని అనుకోలేదు. ఓవర్ షార్ట్ ఫైన్ దిశగా చిప్ చేయాలనుకున్నాను. కానీ బ్యాట్ పవర్‌కు అది సిక్సర్‌గా వెళ్లింది. అలాగే ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు పర్వాలేదనిపించారు. ఫీల్డింగ్‌ మాత్రం చాలా దారుణంగా ఉంది.’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసినా.. తన బ్యాటింగ్‌ చెత్తగా అనిపించిందని పేర్కొనడం గమనార్హం. మరి రోహిత్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తొలి టీమిండియా ప్లేయర్ గా..