వీడియో: ఆకాశ్​దీప్​ పనికి షాకైన రోహిత్.. షమి వారసుడు మామూలోడు కాదు!

Rohit Sharma Shocked by Akash Deep: భారత్-బంగ్లాదేశ్​ మధ్య రెండో టెస్ట్ స్టార్ట్ అయింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో పేసర్ ఆకాశ్​దీప్ చేసిన ఓ పనికి రోహిత్ శర్మ షాక్ అయ్యాడు.

Rohit Sharma Shocked by Akash Deep: భారత్-బంగ్లాదేశ్​ మధ్య రెండో టెస్ట్ స్టార్ట్ అయింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో పేసర్ ఆకాశ్​దీప్ చేసిన ఓ పనికి రోహిత్ శర్మ షాక్ అయ్యాడు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మొదలైంది. కాన్పూర్​లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందు రోజు వర్షం పడటంతో బౌలర్లకు పిచ్ నుంచి హెల్ప్ దొరుకుతుందనే ఉద్దేశంతో అతడు బౌలింగ్​కు వెళ్లాడు. చెన్నై టెస్ట్​లో ఆడిన జట్టునే సెకండ్ టెస్ట్​కూ కంటిన్యూ చేశాడు. వికెట్​ స్పిన్​కు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ హిట్​మ్యాన్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగాడు. అయితే బౌలింగ్ టైమ్​లో పేసర్ ఆకాశ్​దీప్ చేసిన ఓ పనికి రోహిత్ షాక్ అయ్యాడు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్​కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాకీర్ హుస్సేన్​ (0)ను ఆకాశ్​దీప్ ఔట్ చేశాడు. అతడి బౌలింగ్​లో యశస్వి జైస్వాల్​కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు జాకీర్. ఆ తర్వాత నాలుగు ఓవర్ల గ్యాప్​లో షాద్మన్ ఇస్లాం (24)ను పెవిలియన్​కు పంపించాడు ఆకాశ్​దీప్. అతడు వేసిన బాల్ గుడ్ లెంగ్త్​లో పడి కాస్త స్వింగ్ అయి లోపలకు దూసుకొచ్చింది. ఆ డెలివరీని డిఫెన్స్ చేయడంలో షాద్మన్ ఫెయిల్ అయ్యాడు. అతడి ప్యాడ్స్​కు తగిలింది బాల్. దీంతో ఆకాశ్​దీప్ సహా ఇతర భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అయితే రోహిత్ మాత్రం అది నాటౌట్ అనుకున్నాడు. బాల్ లెగ్ స్టంప్​ను మిస్ అవుతోందని భావించి డీఆర్ఎస్ తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఆకాశ్​దీప్ మాత్రం రివ్యూ తీసుకోవాల్సిందేనని అతడ్ని కన్విన్స్ చేశాడు.

బాల్ స్టంప్స్ మిస్ అయి వెళ్తున్నట్లు కనిపించడంతో డీఆర్ఎస్ అక్కర్లేదు.. రివ్యూ వేస్ట్ అవుతుందని రోహిత్ అనుకున్నాడు. కానీ ఆకాశ్​దీప్ మాత్రం అది క్లియర్ ఔట్, డీఆర్ఎస్ తీసుకోమంటూ హిట్​మ్యాన్​ను ఒప్పించాడు. దీంతో రివ్యూ తీసుకోగా.. షాద్మన్ ఎల్బీడబ్ల్యూ అని తేలింది. దీంతో హిట్​మ్యాన్ బిత్తరపోయాడు. భలే వికెట్ దొరికిందని సంతోషంలో మునిగిపోయాడు. తొలుత రివ్యూ తీసుకోమంటూ ఆకాశ్​ ఒత్తిడి చేయడంతో సీరియస్ అయిన రోహిత్.. ఆ తర్వాత వికెట్ రావడంతో అతడి పనికి షాక్ అయ్యాడు. సీనియర్ అయిన తమ కంటే అతడు రివ్యూను కరెక్ట్​గా జడ్జ్ చేయడంతో హ్యాపీ ఫీల్ అయ్యాడు. అందుకు ఆకాశ్​ను మెచ్చుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ జూనియర్ షమి అంటే అలాగే ఉంటుందని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​ తొలి రోజు ముగిసేసరికి బంగ్లాదేశ్ 3 వికెట్లకు 107 రన్స్ చేసింది. మోమినుల్ హక్ (40 నాటౌట్), ముష్ఫికర్ రహీం (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఎడతెరపి లేని వర్షం కారణంగా తొలి రోజు ఆటను నిలిపివేశారు.

Show comments