వీడియో: మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే పాండ్యాపై రోహిత్‌ శర్మ సీరియస్‌!

Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే.. మ్యాచ్‌ తర్వాత హార్ధిక్‌ పాండ్యాకు, రోహిత్‌ శర్మ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. అయితే.. మ్యాచ్‌ తర్వాత హార్ధిక్‌ పాండ్యాకు, రోహిత్‌ శర్మ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దారుణ ఓటమి చవిచూసింది. ఆల్‌మోస్ట్‌ చాలా సులువుగా గెలస్తుంది అనుకున్న మ్యాచ్‌లో ముంబై చేజేతులా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా చేసిన తప్పులే ముంబై ఓటమిని శాసించాయి. కెప్టెన్‌గా, బౌలర్‌గా, బ్యాటర్‌గా ఇలా అన్ని విభాగాల్లోనూ పాండ్యా దారుణంగా విఫలం అయ్యాడు. అవి కాక.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ విషయంలో కాస్త అతిగా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. అయితే.. మ్యాచ్‌ తర్వాత వీరిద్దరి మధ్య చిన్న గొడవ కూడా జరిగినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మ్యాచ్‌ అయిపోయిన తర్వాత.. గ్రౌండ్‌లో రోహిత్‌ శర్మ గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్స్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ టైమ్‌లో హార్ధిక్‌ పాండ్యా వచ్చి.. రోహిత్‌ను వెనుక నుంచి కౌగిలించుకున్నాడు. వెంటనే వెనక్కి చాలా చిరాగ్గా తీరి.. చాలా సీరియస్‌గా పాండ్యాకు క్లాస్‌ పీకాడు. పాండ్యాతో రోహిత్‌ శర్మ చాలా సీరియస్‌గా మాట్లాడుతుంటే.. అక్కడే ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌, ముంబై ఇండియన్స్‌ ఓనర్‌ ఆకాశ్‌ అంబానీ బిత్తరపోయి రోహిత్‌ వైపు చూస్తున్నారు. మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా చేసిన తప్పులపై, తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రోహిత్‌ గట్టి క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో రోహిత్‌ చాలా సీరియస్‌గా మాట్లాడుతుంటే.. పాండ్యా కామ్‌గా చేతులు కట్టుకుని వింటున్నాడు.

అయితే.. ఈ సీజన్‌కి ముందు రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి, గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబైలోకి వచ్చిన పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ చాలా కోపంగా ఉన్నారు. అలాగే రోహిత్‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డబ్బుల కోసం గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌కు మారాడని.. పాండ్యాపై గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్యాన్స్‌ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు రోహిత్‌ ఫ్యాన్స్‌, అటు గుజరాత్‌ ఫ్యాన్స్‌ రెండు వైపుల నుంచి పాండ్యాకు తలనొప్పి ఎదురైంది. పైగా మ్యాచ్‌ ఓడిపోవడం, రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేయించడం ఇలా అన్ని విషయాలు పాండ్యాకు వ్యతిరేకంగా జరిగాయి. మరి మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ శర్మ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments