iDreamPost
android-app
ios-app

కొత్త చరిత్ర లిఖించిన రోహిత్‌! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

  • Published Jul 24, 2023 | 10:21 AM Updated Updated Jul 24, 2023 | 10:21 AM
  • Published Jul 24, 2023 | 10:21 AMUpdated Jul 24, 2023 | 10:21 AM
కొత్త చరిత్ర లిఖించిన రోహిత్‌! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్‌ ఓ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ సూపర్‌ బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. తొలి టెస్ట్‌లో టీమిండియా విజయంలో కూడా రోహిత్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం రెండో టెస్ట్‌లోనూ టీమిండియా విజయం వైపు దూసుకెళ్తోంది. కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న రోహిత్‌.. బ్యాటర్‌గా సైతం సూపర్‌ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మరె క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డును సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఏకధాటిగా 30 ఇన్నింగ్స్‌ల్లో డబుల్‌ డిజిట్‌ ప్లస్‌ స్కోర్‌ చేసిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్దనే 29 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా డబుల్‌ డిజిట్‌ స్కోర్‌తో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా నిన్నటి వరకు ఉన్నాడు. కానీ అతని రికార్డును రోహిత్‌ తాజాగా బద్దులుకొట్టి.. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో 10 అంతకంటే ఎక్కువ స్కోర్‌ చేసిన క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర లిఖించాడు.

రోహిత్‌ శర్మ తర్వాత చూసుకుంటే.. మహేల జయవర్దనే(29 ఇన్నింగ్స్‌లు), ఇంగ్లండ్‌ ఆటగాడు లెన్ హట్టన్(25), వెస్టిండీస్‌ బ్యాటర్‌ రోహన్ కన్హై(25), సౌతాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌(24) ఇన్నింగ్స్‌ల్లో వరుసగా డబుల్‌ డిజిట్‌ స్కోర్‌తో రాణించారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్‌ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ 38, రోహిత్‌ 57, గిల్‌(29 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌(52 నాటౌట్‌) పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్‌ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులతో నాలుగో రోజు ఆటను ముగించింది. ఇక చివరి రోజు భారత్‌ బౌలర్లు 8 వికెట్లు తీసుకుంటే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది. మరి ఈ మ్యాచ్‌తో రోహత్‌ సాధించిన అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టెస్టుల్లో తొలి హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌.. పంత్‌కు థ్యాంక్స్ చెబుతూ..!