జీవితంపై విరక్తి చెందిన సమయంలో యువీ అండగా నిలబడ్డాడు: రోహిత్‌ శర్మ

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన జీవితంలో కష్టకాలంలో టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఏ విధంగా అండగా నిలబడ్డాడో వెల్లడించాడు. ఆ సమయంలో యువీ ఇచ్చిన మోరల్‌ సపోర్ట్‌ను తన జీవితంలో మర్చిపోలేనని రోహిత్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసియా కప్‌కు సిద్ధమవుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. పాకిస్థాన్‌ డేంజరస్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నెట్స్‌లో లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. రేపటి నుంచి పాకిస్థాన్‌-నేపాల్‌ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్‌ 2023 ప్రారంభం కానుంది.

ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చి.. అదే ఉత్సాహంతో అక్టోబర్‌ 5నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు వెళ్లాలని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ భావిస్తున్నాడు. అయితే.. వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఎంపికపై స్పందిస్తూ.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై కూడా రోహిత్‌ శర్మ స్పందించాడు. ఆ సమయంలో తనకు జీవితంపై విరక్తి చెందిన ఫీలింగ్‌ కలిగిందని, ఇంకా లైఫ్‌లో చేయడానికి ఏం మిగల్లేదని అనిపించిందని అన్నాడు. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ప్లేస్‌ దక్కకపోవడంతో రూమ్‌లో నుంచి బయటికి కూడా రాలేకపోయానని రోహిత్‌ తెలిపాడు.

తాను అలా బాధపడుతుంటే.. యువరాజ్‌ సింగ్‌ తెలుసుకుని, తనను అతని రూమ్‌కు పిలిపించుకుని, డిన్నర్‌ కోసం రెస్టారెంట్‌కి తీసుకెళ్లి.. జట్టులో చోటు దక్కకపోతే ఎలా అనిపిస్తుందో, ఈ సిచ్యూవేషన్‌ నుంచి ఎలా బయటపడాలో వివరించాడు. ఇంకా చాలా టైమ్‌ ఉందని చెప్పాడు. యువీ మాట్లాడిన తర్వాత తాను నార్మల్‌ అయినట్లు రోహిత్‌ వెల్లడించాడు. అయితే.. 2011 వరల్డ్‌ కప్‌ కోసం అప్పటి టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని.. జట్టులో యువ స్పిన్నర్‌ పియూష్‌ చావ్లా ఉండాలని కోరుకున్నాడని, దాంతో యువ బ్యాటర్‌ రోహిత్‌పై వేటు పడినట్లు మాజీ సెలెక్టర్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. మరి రోహిత్‌కు యువీ అండగా నిలబడిన తీరు, ఆ తర్వాత రోహిత్‌ ఎదిగిన విధానంపైమ ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఏం గుండెరా నీది.. ఆ కొట్టుడు ఏంది? 40 బంతుల్లోనే.. అదికూడా టీ20లో

Show comments