Somesekhar
టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి ఓ ఇష్టం లేని పదం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి ఇంతకీ విరాట్ కోహ్లీకి నచ్చని ఆ పదం ఏంటి? ఆ వివరాలు..
టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి ఓ ఇష్టం లేని పదం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి ఇంతకీ విరాట్ కోహ్లీకి నచ్చని ఆ పదం ఏంటి? ఆ వివరాలు..
Somesekhar
ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ డైలాగ్ చెబుతాడు.. ‘తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం’. ఇక ఈ మూవీలో మెగాస్టార్ కు నచ్చని పదం ఉన్నట్లే.. నిజ జీవితంలో టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి కూడా ఓ ఇష్టం లేని పదం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ విరాట్ కోహ్లీకి నచ్చని ఆ పదం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇటీవల ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్బుత విజయాన్ని నమోదు చేసింది. నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన రెండు సూపర్ ఓవర్లు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఈ మ్యాచ్ లో వన్ మ్యాన్ షోతో అలరించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. 121 పరుగులు చేసి.. అజేయంగా నిలిచాడు హిట్ మ్యాన్. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటుగా సంజూ శాంసన్ కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. తాజాగా వీరిద్దరి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ.
“గత కొంతకాలంగా మేం ఆడిన అన్ని టోర్నీల్లోనూ బాధ్యతలను స్పష్టంగా కలిసి పంచుకున్నాం. జట్టులోని ప్లేయర్లకు వారి వారి పాత్రలపై అవగాహన కల్పించాను. దీంతో టీమ్ లో వారి అవసరం ఎక్కడ ఉందో యంగ్ ప్లేయర్లు తెలిసొచ్చింది. ఇక చివరి మ్యాచ్ లో పరుగులు చేయాలన్న కసితో బరిలోకి దిగాడు విరాట్. కానీ అనూహ్యంగా అతడు డకౌట్ గా వెనుదిరిగాడు. అసలు అతడికి డకౌట్ అనే పదం నచ్చదు. అయితే కోహ్లీ ఇలా డకౌట్ అయినప్పటికీ.. అతడి థింకింగ్ మాత్రం కరెక్ట్ గానే ఉంది” అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ.
ఇక శాంసన్ కూడా ఇదే ఆలోచనతో వచ్చి డకౌట్ గా పెవిలియన్ చేరాడని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సందర్భంగానే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి, టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడాడు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ గురించి ఇప్పుడు ఆలోచించడం కరెక్ట్ కాదని రోహిత్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ గెలవడం ఓ ఆటగాడిగా నాకెంతో ప్రత్యేకం, అయితే అలాగని టీ20 వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్ షిప్ లను తక్కువ చేయడం లేదని రోహిత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం మా దృష్టంతా టీ20 వరల్డ్ కప్ పైనే ఉందని, తప్పకుండా దాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు టీమిండియా సారథి రోహిత్. మరి విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టిన రోహిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RohitSharma comments on #ViratKohli‘s dramatic duck in the 3rd T20I.https://t.co/hGc5Bt8j1a
— CricTracker (@Cricketracker) January 19, 2024