iDreamPost

Rohit Sharma: ఈ కప్పు వాళ్లకే సొంతం.. విక్టరీ పరేడ్ తర్వాత రోహిత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

  • Published Jul 05, 2024 | 3:49 PMUpdated Jul 05, 2024 | 3:49 PM

టీమిండియా విక్టరీ పరేడ్ నెక్స్ట్ లెవల్​లో జరిగింది. వరల్డ్ కప్ ట్రోఫీతో సొంతగడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. ప్లేయర్లను చూసేందుకు లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైకి తరలివచ్చారు.

టీమిండియా విక్టరీ పరేడ్ నెక్స్ట్ లెవల్​లో జరిగింది. వరల్డ్ కప్ ట్రోఫీతో సొంతగడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. ప్లేయర్లను చూసేందుకు లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైకి తరలివచ్చారు.

  • Published Jul 05, 2024 | 3:49 PMUpdated Jul 05, 2024 | 3:49 PM
Rohit Sharma: ఈ కప్పు వాళ్లకే సొంతం.. విక్టరీ పరేడ్ తర్వాత రోహిత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

టీమిండియా విక్టరీ పరేడ్ నెక్స్ట్ లెవల్​లో జరిగింది. వరల్డ్ కప్ ట్రోఫీతో సొంతగడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. ప్లేయర్లను చూసేందుకు లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైకి తరలివచ్చారు. అక్కడి ఎయిర్​పోర్ట్​లో ఆటగాళ్లు దిగినప్పటి నుంచి అభిమానుల కోలాహలం మొదలైంది. ఇంక విక్టరీ పరేడ్​ టైమ్​లో దేశప్రజలంతా ముంబైలోనే ఉన్నారా అని అనిపించింది. క్రికెటర్లను చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో మహా నగర వీధులు, రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇసుక వేసినా రాలనంత జనం ఉండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఊహించనంత ప్రజలు రావడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఓపెన్ బస్​లో ఎక్కి విక్టరీ పరేడ్​కు వచ్చిన భారత ఆటగాళ్లను చూడగానే అప్పటిదాకా వర్షంలో తడుస్తూ నిల్చున్న ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.

వరల్డ్ కప్ హీరోస్​ను చూసిన ఆనందంతో అప్పటిదాకా పడిన బాధ, కష్టాన్ని మర్చిపోయారు. ఫ్యాన్స్. ట్రోఫీని చేతబట్టిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసి పరవశంలో మునిగిపోయారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. విక్టరీ పరేడ్​తో పాటు వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ అభిమానులను కలుసుకున్నారు భారత ఆటగాళ్లు. వాళ్లకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. హిట్​మ్యాన్​తో పాటు విరాట్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ స్టేడియంలో మాస్ డ్యాన్స్​తో అలరించారు. ఆ కార్యక్రమంలో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెల్​కమ్ చెప్పేందుకు వచ్చిన అభిమానులను థ్యాంక్స్ చెప్పాడు హిట్​మ్యాన్. అందరూ రాణించబట్టే ట్రోఫీని కైవసం చేసుకున్నామని తెలిపాడు.

విక్టరీ పరేడ్​ను చూసి షాకయ్యానని.. ఇంతలా తరలివచ్చిన ఫ్యాన్స్​ను చూస్తుంటే ఈ వరల్డ్ కప్ టైటిల్ కోసం తమలాగే వాళ్లు కూడా ఎంతగా వెయిట్ చేశారో అర్థమైందన్నాడు రోహిత్. తాజాగా అతడు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టాడు. టీమిండియా విక్టరీ పరేడ్​కు సంబంధించిన ఫొటోలను హిట్​మ్యాన్ పంచుకున్నాడు. తన చేతిలో కప్పు ఉన్న ఫొటోతో పాటు జాతీయ జెండాలతో అభిమానులు ఉన్న ఫొటోనూ ట్విట్టర్​లో షేర్ చేశాడు భారత సారథి. దీనికి ఓ అదిరిపోయే క్యాప్షన్ జత చేశాడు. ఇది మీ అందరిదీ.. ఈ కప్ యావత్ దేశానికి చెందుతుందంటూ ట్వీట్ చేశాడు హిట్​మ్యాన్. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది రోహిత్ సింప్లిసిటీకి నిదర్శనమని అంటున్నారు. ఈ దేశం ఎప్పుడూ ఆటగాళ్లకు అండగా ఉంటుందని, వాళ్లు మరిన్ని ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి