iDreamPost

ఇదే నా చివరి ఐపీఎల్‌ అంటూ రోహిత్‌ సంచలన స్టేట్‌మెంట్‌! వీడియో లీక్‌!

  • Published May 11, 2024 | 3:13 PMUpdated May 11, 2024 | 3:13 PM

Rohit Sharma, Abhishek Nayar, MI vs KKR: ఐపీఎల్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేదా? ఇదే క్రికెట్‌ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. దానికి కారణం లీకైన ఓ వీడియో.. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Abhishek Nayar, MI vs KKR: ఐపీఎల్‌ 2024 తర్వాత రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో కొనసాగుతాడా? లేదా? ఇదే క్రికెట్‌ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. దానికి కారణం లీకైన ఓ వీడియో.. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published May 11, 2024 | 3:13 PMUpdated May 11, 2024 | 3:13 PM
ఇదే నా చివరి ఐపీఎల్‌ అంటూ రోహిత్‌ సంచలన స్టేట్‌మెంట్‌! వీడియో లీక్‌!

టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన విషయం వెల్లడించాడు. ఇదే తనకు చివరి సీజన్‌ అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్లేస్‌లో హార్ధిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా నియమించినప్పటి నుంచి అంటిముట్టనంటూ ఉంటున్న రోహిత్‌ శర్మ.. తాజాగా కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి తనను తప్పించిన తర్వాత.. ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడని రోహిత్‌ శర్మ.. తాజాగా ఆ విషయంలో ఓపెన్‌ అయిపోయి.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియోను కేకేఆర్‌ తమ అధికారిక ట్వీట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసి.. వెంటనే డిలీట్‌ చేసింది.

కేకేఆర్‌తో మ్యాచ్‌ కోసం ముంబై ఇండియన్స్‌ టీమ్‌ కోల్‌కత్తా చేరుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ, కేకేఆర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఒక్కో ఒక్కో విషయం మారుతోంది. అది వాళ్లపైన ఉంది.. నాకు ఎలాంటి ఫరక్‌ పడదు. నేను ఎక్కడికి వెళ్లను. ఏది ఏమైనా.. ఇది నా ఇళ్ల. ఆ టెంపుల్‌ నేను నిర్మించింది. నాకేంటి.. ఇదైతే నా లాస్ట్‌..’ అని రోహిత్‌ అన్నాడు. హిందీలో మాట్లాడుతూ రోహిత్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తనను కెప్టెన్సీ నుంచి తప్పించి, పాండ్యాకు ఇవ్వడం, ముంబై ఇండియన్స్‌ టీమ్‌ ప్రదర్శన, వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ గురించే మాట్లాడినట్లు అర్థం అవుతుంది.

అందులో భాగంగా నేను ఎక్కడికి వెళ్లను, ఇది నా ఇళ్లు అని ముంబైని ఉద్దేశించి అన్నాడు. ముంబై అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్‌ టీమ్‌ అని కాదు.. రోహిత్‌ నివాసం ఉండేది ముంబైలోనే.. అందుకే రోహిత్‌కు ముంబై నుంచి భారీగా అభిమానులు ఉంటారు. వాళ్లు తనపై ప్రేమతో ఏదో చేస్తున్నారని, నేను వేరే చోటుకి మారలేను కదా అని రోహిత్‌ అన్నాడు. అలాగే ముంబై ఇండియన్స్‌ టీమ్‌ అంత స్ట్రాంగ్‌ అవ్వడానికి, ఐదు కప్పులు గెలవడానికి కారణం నేను, అది నేను సృష్టించిన సామ్రాజ్యం అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే చివర్లో ఇది నా లాస్ట్‌ అన్నాడు. అంటే ఇదే నా చివరి ఐపీఎల్‌ సీజనా? లేక ముంబై ఇండియన్స్‌లో ఇదే ఆఖరి సీజన్‌ అన్నాడా? అనే విషయం అర్థం కాక ఫ్యాన్స్‌ తలపట్టుకుంటున్నారు. అయితే.. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చేందుకు ఫిక్స్‌ అయి రోహిత్‌ ఇలా అన్నాడని, చివరి ఐపీఎల్‌ అయితే కచ్చితంగా కాదని, వచ్చే ఐపీఎల్‌ నుంచి వేరే టీమ్‌కు రోహిత్‌ ఆడటం పక్కా అంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి