అప్పటి వరకు టీమిండియాకు ఆడుతూనే ఉంటా! దేశంపై రోహిత్‌కు ఇంత ప్రేమా?

Rohit Sharma, T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్‌లో ఇరగదీస్తున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ ఆసక్తికర విషయంపై ‍స్పందిస్తూ.. సంచలన ప్రకటన చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, T20 World Cup 2024: ప్రస్తుతం ఐపీఎల్‌లో ఇరగదీస్తున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ ఆసక్తికర విషయంపై ‍స్పందిస్తూ.. సంచలన ప్రకటన చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీబిజీగా ఉన్నాడు. పైగా మంచి ఫామ్‌లో కొనసాగుతూ.. ముంబై ఇండియన్స్‌కు అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. నిజానికి ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ ఆడడేమో అని చాలా మంది కంగారు పడ్డారు. ఎందుకంటే.. ఈ సీజన్‌ కంటే ముందు రోహిత్‌ శర్మను ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించి.. అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యాను తమ కెప్టెన్‌గా నియమించింది ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌. ఈ నిర్ణయంతో రోహిత్‌ శర్మ తీవ్రంగా హర్ట్‌ అయ్యాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన తనను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని రోహిత్‌ అవమానంగా ఫీల్‌ అయ్యాడు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు తాను ఈ సీజన్‌ ఆడటం లేదని, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ ఆడి అలసిపోయానని, అలాగే జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ ఉన్న నేపథ్యంలో ఆ మెగా టోర్నీకి ఫ్రెష్‌గా బరిలోకి దిగేందుకు.. ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు రోహిత్‌ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. కెప్టెన్సీ నుంచి తప్పించినందుకు కోపంగా ఉన్న రోహిత్‌ ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటాడని భయపడుతున్న ఫ్యాన్స్‌కు షాకిస్తూ.. రోహిత్‌ ఆ పోస్ట్‌ చేశాడు. కానీ, ఏమైందో ఏమో కానీ, క్షణాల్లోనే ఆ పోస్ట్‌ను డిలిట్‌ చేసి.. ముంబై క్యాంప్‌లో చేరి.. ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా అదరగొడుతున్నాడు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అయితే నేను బాగానే ఆడుతున్నాను.. ఇప్పుడు నేను ఆడుతున్న విధానం చూస్తే.. మరో కొన్నేళ్లు క్రికెట్‌లో కొనసాగుతాను అని అన్నాడు. దానికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ఎప్పటి వరకు ఇండియాకు వరల్డ్‌ కప్‌ అందించే వరకా? అని అడగ్గా.. అవును, వరల్డ్‌ కప్‌ గెలవాలని నేను నిజంగా బలంగా కోరుకుంటున్నాను అతని మనసులో మాట బయటపెట్టాడు. ముంబై ఇండియన్స్‌లో తనకు జరిగిన అవమానాన్ని పక్కనపెట్టి.. టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు ఐపీఎల్‌ను ప్రాక్టీస్‌లా మార్చుకోవాలని, తనకు అవమానం టీమ్‌లో కొనసాగుతున్నాడు. దేశానికి వరల్డ్‌ కప్‌ అందించాలని రోహిత్‌ తనకు జరిగిన అవమానాన్ని సైతం మర్చిపోయాడని క్రికెట్‌ అభిమానులు రోహిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించే వరకు క్రికెట్‌లో కొనసాగుతానని రోహిత్‌ పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments