iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో రోహిత్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌! చెత్త కెప్టెన్‌ అంటూ..

  • Published Nov 02, 2023 | 10:55 AM Updated Updated Dec 15, 2023 | 6:07 PM

వరల్డ్‌ కప్‌లో టీమిండియా సూపర్‌ ఫామ్‌లో దూసుకెళ్తోంది. రోహిత్‌ శర్మ బ్యాటర్‌గానే కాక.. కెప్టెన్‌గానూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. కానీ, లంకతో మ్యాచ్‌కి ముందు రోహిత్‌ చేసిన కామెంట్లు షాకింగ్‌గా ఉన్నాయి. మరి అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో టీమిండియా సూపర్‌ ఫామ్‌లో దూసుకెళ్తోంది. రోహిత్‌ శర్మ బ్యాటర్‌గానే కాక.. కెప్టెన్‌గానూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. కానీ, లంకతో మ్యాచ్‌కి ముందు రోహిత్‌ చేసిన కామెంట్లు షాకింగ్‌గా ఉన్నాయి. మరి అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 02, 2023 | 10:55 AMUpdated Dec 15, 2023 | 6:07 PM
వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో రోహిత్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌! చెత్త కెప్టెన్‌ అంటూ..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా 7వ మ్యాచ్‌ కోసం రెడీ అయింది. గురువారం ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో శ్రీలంకతో రోహిత్‌ సేన తలపడనుంది. ఇప్పటికే ఆరు విజయాలతో మంచి ట్రాక్‌ రికార్డ్‌ కలిగి ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే.. భారత జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి వెళ్తోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఇండియా 12 పాయింట్లతో సమానంగా ఉన్నా.. నెట్‌ రేట్‌ విషయంలో ప్రొటీస్‌ జట్టు కాస్త ముందు ఉండటంతో ఫస్ట్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. కాకుంటే.. సౌతాఫ్రికాకు 7 మ్యాచ్‌లు ఆడి ఒక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అది కూడా నెదర్లాండ్స్‌ లాంటి పసికూన చేతిలో. ప్రస్తుతం నంబర్‌ వన్‌ స్థానం కోసం ఇండియా, సౌతాఫ్రికా మధ్య పోటీ నడుస్తోంది.

పాయింట్ల విషయం పక్కనపెడితే.. శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తాను ఎక్కడికి వెళ్లినా.. కలిసిన ప్రతి అభిమాని తనను ఒక్కటే అడుగుతున్నారని, వరల్డ్‌ కప్‌ గెలవాలని కోరుతున్నారని చెప్పాడు. అయితే.. ప్రస్తుతం అంతా బాగా నడుస్తోంది కానీ, ఈ వరల్డ్‌ కప్‌లో ఒక్క మ్యాచ్‌ కాస్త అటూ ఇటూ అయినా కూడా నేనో బ్యాడ్‌ కెప్టెన్‌ అయిపోతా అంటూ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మన దేశంలో క్రికెట్‌ను ఏ రేంజ్‌లో ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. గతంలో కూడా టీమిండియా పలు వరల్డ​్‌ కప్స్‌లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వచ్చి.. కీలకమైన సెమీ ఫైనల్‌, ఫైనల్స్‌లో ఓటమి పాలైంది. కానీ, ఈ సారి అలాంటి తప్పు జరగడానికి వీల్లేదని భారత జట్టు మొత్తం గట్టి పట్టుదలతో ఉంది.

ఇక శ్రీలంకపై విజయం సాధిస్తే.. టీమిండియా నేరుగా సెమీస్‌లోకి అడుగుపెడుతోంది. ఈ వరల్డ్‌ కప్‌లో అధికారికంగా సెమీస్‌ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలుస్తోంది. టీమిండియా తర్వాత సౌతాఫ్రికా సెమీస్‌ చేరే అవకాశం బలంగా ఉంది. ఇక మూడు, నాలుగో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు స్థానాల కోసం.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, శ్రీలంక పోటీ పడుతున్నాయి. అయితే.. కివీస్‌, ఆసీస్‌కే ఎక్కువ ఛాన్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక పాకిస్థాన్‌ లేదా ఆఫ్ఘాన్‌ సెమీస్‌ చేరాలంటే.. కొన్ని అద్భుతాలు జరగాల్సి ఉంది. మరి.. లంకతో మ్యాచ్‌కి ముందు రోహిత్‌ శర్మ తన కెప్టెన్సీపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.