SNP
SNP
వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. 2-0 తేడాతో గెలవాల్సిన టెస్ట్ సిరీస్‌ను వర్షం కారణంగా 1-0తో కైవసం చేసుకుని సరిపెట్టుకున్న టీమిండియా.. వన్డే వేటను విజయంతో మొదలుపెట్టింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. టెస్ట్ టీమ్‌తో పోల్చుకుంటే వెస్టిండీస్ టీమ్ కాస్త పటిష్టంగా కనిపించినా.. టీమిండియా బౌలర్లకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ టీమ్‌ను భారత బౌలర్లు 114 పరుగులకే కుప్పకూల్చారు.
భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తాచాటి వెస్టిండీస్ బ్యాటర్లను వణికించారు. 115 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఎవరూ ఊహించని విధంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి ఇషాన్ కిషన్‌ను శుబ్‌మన్ గిల్‌కు జోడిగా ఓపెనర్‌గా దింపాడు. రోహిత్ త్యాగం సఫలీకృతమైంది. వచ్చిన ఛాన్స్‌ను అద్భుతంగా వినియోగించుకున్న ఇషాన్.. హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ, గిల్ దారుణంగా విఫలం అయ్యాడు.
అలాగే విరాట్ కోహ్లీ పర్మినెంట్ ప్లేస్ వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను పంపాడు రోహిత్. కానీ, సూర్య సైతం విఫలం అయ్యాడు. ఇలా పాండ్యా, జడేజా, శార్దుల్ ఠాకూర్ తర్వాత రోహిత్ శర్మ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కోహ్లీ అసలు బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే.. ఈ ప్రయోగాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో రోహిత్ మ్యాచ్ తర్వాత వివరించాడు. అందరికీ గేమ్ టైమ్‌ను ఇవ్వాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపినట్లు వెల్లడించాడు. 115 పరుగుల చిన్న టార్గెట్, పైగా సూర్య, పాండ్యా, శార్దుల్ టెస్ట్ ఆడలేదు. వారికి అవకాశం ఇవ్వాలనే ఆడినట్లు ఉన్నాడు.
కాగా, తాను 7వ స్థానంలో బ్యాటింగ్ రావడంపై స్పందిస్తూ.. ఈ మ్యాచ్‌తో తన డెబ్యూ మ్యాచ్ గుర్తుకు వచ్చిందని అన్నాడు. కెరీర్ ఆరంభంలో రోహిత్ 6, 7వ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఇప్పుడు కూడా అలా రావడంతో ఆ రోజలు గుర్తుకు వచ్చాయని నవ్వుతూ చెప్పాడు. రోహిత్ చివరి సారిగా 2011లో 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మళ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత 7వ స్థానంలో ఆడాడు. మరి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలపై, అలాగే రోహిత్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “We wanted to give chance to everyone, we will keep doing if we get a chance especially it’s important to have game time”. pic.twitter.com/Zj3PxnXX4Q
— Johns. (@CricCrazyJohns) July 27, 2023
Rohit Sharma said “Batting at 7 reminded me of my debut for India”. (Smiles) pic.twitter.com/eYmn7XT8T3
— Johns. (@CricCrazyJohns) July 27, 2023
ఇదీ చదవండి: వయసు అయిపోయిందంటారు.. వాళ్లు లేకుంటే టీమ్‌లో పసే లేదు!