iDreamPost
android-app
ios-app

Rohit Sharma: 2007 కంటే ఈ వరల్డ్ కప్ నాకెంతో ప్రత్యేకం.. ఎందుకంటే?: రోహిత్ శర్మ

  • Published Jul 06, 2024 | 10:21 AM Updated Updated Jul 06, 2024 | 10:21 AM

2007 వరల్డ్ కప్ కంటే ఈ ప్రపంచ కప్ నాకెంతో స్పెషల్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దానికి గల కారణాలను కూడా వివరించాడు హిట్ మ్యాన్. ఆ వివరాల్లోకి వెళితే..

2007 వరల్డ్ కప్ కంటే ఈ ప్రపంచ కప్ నాకెంతో స్పెషల్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దానికి గల కారణాలను కూడా వివరించాడు హిట్ మ్యాన్. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: 2007 కంటే ఈ వరల్డ్ కప్ నాకెంతో ప్రత్యేకం.. ఎందుకంటే?: రోహిత్ శర్మ

13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా వరల్డ్ కప్ ను సాధించి.. 140 కోట్ల మంది భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసింది. చివరిగా 2011లో వన్డే వరల్డ్ కప్ ను ముద్దాడిన భారత్, మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన భారత్ కు అఖండ స్వాగతం లభించింది. విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి అడుగడుగునా ఫ్యాన్స్ విశ్వ విజేతలకు బ్రహ్మరథం పట్టారు. కాగా.. 2007 వరల్డ్ కప్ కంటే ఈ ప్రపంచ కప్ నాకెంతో స్పెషల్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఆ వివరాలు..

టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా వీరులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ముంబైలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఓపెన్ టాప్ బస్ లో వరల్డ్ కప్ ట్రోఫీతో ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. భారత ప్లేయర్లు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. ఈ విన్నింగ్ పరేడ్ ను చూసేందుకు లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. ఇక ఈ ర్యాలీ అనంతరం వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆటగాళ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ప్లేయర్లు గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జయహో భారత్.. ఛాంపియన్స్ అంటూ నినాదాలు చేశారు. ఆటగాళ్లు మాస్ డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు.

ఇదిలా ఉండగా.. ఈ విజయంపై రోహిత్ శర్మ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ మాట్లాడుతూ..”2007 టీ20 వరల్డ్ కప్ ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే? అది కెరీర్ లో తొలి ప్రపంచ కప్. అప్పుడు కూడా ఇదే ముంబైలో విన్నింగ్ పరేడ్ జరిగింది. కానీ ఈ ప్రపంచ కప్ నాకెంతో ప్రత్యేకం. దానికి కారణం లేకపోలేదు. ఈ ప్రపంచ కప్ సాధించిన జట్టుకు నేను సారథిగా ఉన్నాను. దాంతో ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ట్రోఫీ సాధించడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. 140 కోట్ల ఇండియన్స్ కల నెరవేర్చినందుకు గర్వకారణంగా ఉంది” అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.