Rohit Sharma: వరల్డ్‌ కప్‌ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియో రోహిత్‌ మాటలు క్రికెట్‌ అభిమానులను కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమి బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ఆ వీడియో రోహిత్‌ మాటలు క్రికెట్‌ అభిమానులను కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయి.

చాలా రోజుల తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మనసు విప్పి మాట్లాడాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ముగిసిన 20 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రోహిత్‌ ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియో భారత క్రికెట్‌ అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌ 2023లో టీమిండియా టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడింది. వరుసగా పదికి పది మ్యాచ్‌ లు గెలిచి ఫైనల్‌ వరకు చేరింది. వరల్డ్‌ కప్‌ లో ఆడిన ప్రతి జట్టును ఓడించిన టీమ్‌ భారత్‌ ఒక్కటే. చివరి ఛాంపియన్‌ గా నిలిచిన జట్టు ఆస్ట్రేలియా సైతం ఇండియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిపోయింది. కానీ, ఇండియా మాత్రం ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్‌ వరకు దూసుకొచ్చింది.

జట్టులోని ప్రతి ఒక్కరు అద్భుతంగా రాణించారు. 11కి 11 మంది కూడా వారి వారి పాత్రను పోషిస్తూ.. జట్టు విజయానికి తోడ్పడ్డారు. పైగా ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకమైన రోల్‌ లో వరల్డ్‌ కప్‌ గెలవడమే లక్ష్యంగా పోరాటం చేశారు. కానీ, అనూహ్యంగా ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై.. మూడోసారి వరల్డ్‌ కప్‌ గెలిచిన అవకాశాన్ని కోల్పోయింది. రన్నరప్‌ గా నిలిచింది. ఆ ఒక్క ఓటమి 100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఇక ఆటగాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది క్రికెటర్లు ఫైనల్‌ ముగిసిన వెంటనే గ్రౌండ్‌ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు, సోషల్‌ మీడియాలో ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. ఇప్పుడు తాజాగా ఒక వీడియో రిలీజ్‌ చేశాడు.

ఆ వీడియోలో వరల్డ్‌ కప్‌ తర్వాత తాను ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నాను. ఆ ఓటమి బాధ నుంచి తాను బయటపడేందుకు ఏం చేశాడనే విషయాలను గంభీరమైన గొంతుతో రోహిత్‌ శర్మ వెల్లడిస్తుంటే.. మాటలు మనసును మెలి పెడుతున్నాయి. టీమిండియా కెప్టెన్‌ గా జట్టును అద్భుతంగా నడిపించి.. వరల్డ్‌ కప్‌ గెలవాలని ఎన్నో ఏళ్లుగా కల కంటున్న రోహిత్‌ శర్మ.. ఆ కలకు అడుగుదూరంలో మిస్‌ అయ్యాడు. అతనితో పాటు సీనియర్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం వరల్డ్‌ కప్‌ ఎత్తాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు యావత్‌ దేశం.. టీమిండియా వరల్డ్‌కప్‌ ఎత్తుతుంటే చూడాలని వేయికళ్లతో ఎదురుచూసింది. కానీ, చివరి మెట్టుపై టీమిండియా ఓటమి పాలు కావడంతో దేశం మొత్తం నిరాశలో మునిగిపోయింది. మరి రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ ఓటమిపై రీలిజ్‌ చేసిన వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments