జస్ట్‌ బ్యాటర్‌గా గ్రౌండ్‌లోకి రోహిత్‌ శర్మ! తొలి మ్యాచ్‌లో అతని టార్గెట్‌ ఇదే?

Rohit Sharma, MI vs GT, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రోహిత్‌ శర్మ తొలి మ్యాచ్‌కు గాయపడిన సింహంలా బరిలోకి దిగబోతున్నాడు. మరి ఎలాంటి టార్గెట్‌తో ఫస్ట్‌ మ్యాచ్‌కు సిద్ధం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, MI vs GT, IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో రోహిత్‌ శర్మ తొలి మ్యాచ్‌కు గాయపడిన సింహంలా బరిలోకి దిగబోతున్నాడు. మరి ఎలాంటి టార్గెట్‌తో ఫస్ట్‌ మ్యాచ్‌కు సిద్ధం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌కు సిద్ధం అవుతుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటిన్స్‌తో ముంబై ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ ఆడునుంది. ఈ మ్యాచ్‌కు ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి అయ్యాయి. ఇరు జట్లు కూడా ముమ్మర ప్రాక్టీస్‌తో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. ఈ సీజన్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలని భావిస్తున్నాయి. అందుకే ఇరు జట్లు ఫస్ట్‌ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఎలా ఆడతాడా? అంటూ అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా చాలా కాలం పాటు కొనసాగిన రోహిత్‌ శర్మ.. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఏకంగా ఐదు ట్రోఫీలు అందించాడు. అయితే.. 2013 తర్వాత రోహిత్‌ శర్మ ఒక సాధారణ బ్యాటర్‌గా ముంబై తరఫున తొలిసారి బరిలోకి దిగుతున్నాడు. అందుకే రోహిత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌ 2024 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో చోటు చేసుకున్న పరిణామాల గురించి క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసిందే. ఐపీఎల్‌ 2021 సీజన్‌ తర్వాత హార్ధిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడి.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో డబ్బు కోసమే ముంబైని వీడాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు పాండ్యా.

తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపినా, రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచినా.. కూడా ఏమైందో ఏమో కానీ, ఈ సీజన్‌ కంటే ముందు తిరిగి ముంబైలోకి వచ్చేశాడు. అతను రావడంతోనే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి.. ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది ముంబై మేనేజ్‌మెంట్‌. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. రోహిత్‌ అభిమానులు పాండ్యాపై, ముంబై మేనేజ్‌మెంట్‌పై సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు. ముంబై జెర్సీలను తగలబెట్టి, ఇన్‌స్టాలో ముంబై అకౌంట్‌ను లక్షల్లో అన్‌ఫాలో చేశారు. తన కెప్టెన్సీ నుంచి తీసేయడం రోహిత్‌కు కూడా ఇష్టం లేనట్లు ఉంది. అందుకే ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ఆడటం లేదని ఒక పోస్ట్‌ పెట్టి మళ్లీ వెంటనే తొలగించాడు.

ఒకానొక దశలో రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడి వేరే ఫ్రాంచేజ్‌కు వెళ్తాడని, అలా కుదరకుంటే ఈ సీజన్‌కు దూరంగా ఉంటాడనే టాక్‌ వినిపించింది. కానీ, ఎట్టకేలకు రోహిత్‌ శర్మ ఈ సీజన్‌లో ఒక బ్యాటర్‌గా ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అందుకే అందరి కళ్లు అతనిపైనే ఉన్నాయి. అయితే కెప్టెన్సీ పోయి, బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న క్రమంలో రోహిత్‌ ఒక పక్కా టార్గెట్‌తో వస్తున్నట్లు కనిపిస్తోంది. తన సత్తా ఏంటో ఈ మ్యాచ్‌లో చూపించాలని అనుకుంటున్నాడటా.. గుజరాత్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో తన హండ్రెట్‌ పర్సంట్‌ ఎఫర్ట్‌ ఇచ్చి, ఒక భారీ స్కోర్‌ చేసి.. రోహిత్‌శర్మ అంటే ఏంటో ముంబై మేనేజ్‌మెంట్‌కు మరోసారి గుర్తుచేయాలనే టార్గెట్‌తో రోహిత్‌ గ్రౌండ్‌లోకి గాయపడిన సింహంలా దిగబోతున్నాడు. మరి తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఎన్ని రన్స్‌ చేస్తాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments