ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. టెస్టు, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని మంచి ఊపుమీదున్న టీమిండియాను తొలి టీ20లో కంగుతినిపించింది వెస్టిండీస్. ఇక ఈ సిరీస్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో.. పాండ్యా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఘోరంగా అవమానించింది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం. విరాట్ కోహ్లీకి ఇచ్చినంత వ్యాల్యూ కూడా రోహిత్ కు ఇవ్వలేదు. ఇంతకీ స్టార్ స్పోర్ట్స్ చేసిన పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ.. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఫిట్ నెస్, బిజీ షెడ్యూల్స్ కారణంగా భారత జట్టుకు గత 2 ఏళ్లలో 9 మంది కెప్టెన్లు మారారు. కాగా.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో కూడా వన్డే, టీ20 సిరీస్ కు పాండ్యానే సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు బుమ్రా, ఆసియా కప్ కు రోహిత్ శర్మ, ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా చేయబోతున్నారు. దాంతో సిరీస్ కో కెప్టెన్ మారడం వల్ల రోహిత్ శర్మకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదు.
ఈ క్రమంలోనే ఆసియా కప్ 2023 టోర్నీకి సంబంధించిన ప్రోమోను రూపోందించింది స్టార్ స్పోర్ట్స్. ఈ ప్రోమోలో రోహిత్ శర్మ కనిపించినా.. ఆసియా కప్ పోస్టర్ లో మాత్రం రోహిత్ శర్మ లేడు. దీంతో రోహిత్ శర్మను స్టార్ స్పోర్ట్స్ ఘోరంగా అవమానించింది అంటూ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, రషీద్ ఖాన్, షకీబ్ అల్ హసన్, నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే, శ్రీలంక కెప్టెన్ ల ఫోటోలను ముద్రించింది. కానీ ఇందులో టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఫోటో లేదు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ విషయపై కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ కేవలం పేరుకే కెప్టెన్ అని, అతడిని ఎవరూ పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ టోర్నీలో సెప్టెంబర్ 2న జరిగే ఇండియా-పాక్ పోస్టర్ లో మాత్రం విరాట్ తో పాటుగా రోహిత్ శర్మ కనిపించాడు. మరి రోహిత్ శర్మపై స్టార్ స్పోర్ట్స్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Star Sports’ poster on Asia Cup 2023.
The fight for Asia Cup champions begins from 30th August..!!! pic.twitter.com/TgV631hcJE
— CricketMAN2 (@ImTanujSingh) August 5, 2023
Cricket’s ultimate face-off is here! 🤜🏻🤛🏻#TeamIndia coach, Rahul Dravid’s confidence echoes our sentiments as we might have a possible triple treat to #INDvPAK clash in the #AsiaCup2023! 🔥
Tune-in to #INDvPAK on
2nd September | 3.00 pm onwards | Star Sports Network#Cricket pic.twitter.com/i0u4YBzUC2— Star Sports (@StarSportsIndia) August 5, 2023
ఇదికూడా చదవండి: కాలర్ పట్టుకుని నన్ను తోసేశాడు! సంచలన విషయం బయటపెట్టిన సెహ్వాగ్