iDreamPost

రోహిత్‌ సూపర్‌ ప్లాన్‌! తొలి మ్యాచ్‌లో ఫెయిల్‌ అయినా.. ఇదే కరెక్ట్‌!

  • Published Jun 06, 2024 | 10:51 AMUpdated Jun 06, 2024 | 10:51 AM

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడమే లక్ష్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేసిన ఒక సూపర్‌ ప్లాన్‌ పెయిల్‌ అయినా.. అదే కరెక్ట్‌ అంటున్నారు క్రికెట్‌ నిపుణులు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Virat Kohli, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌ సాధించడమే లక్ష్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేసిన ఒక సూపర్‌ ప్లాన్‌ పెయిల్‌ అయినా.. అదే కరెక్ట్‌ అంటున్నారు క్రికెట్‌ నిపుణులు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 06, 2024 | 10:51 AMUpdated Jun 06, 2024 | 10:51 AM
రోహిత్‌ సూపర్‌ ప్లాన్‌! తొలి మ్యాచ్‌లో ఫెయిల్‌ అయినా.. ఇదే కరెక్ట్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను గెలుపుతో సగర్వంగా ప్రారంభించింది రోహిత్‌ సేన. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్‌ తర్వాత టీమిండియా 9న ఇదే గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్‌-ఏలో టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వగల ఒకే జట్టు పాకిస్థాన్‌. ఆ జట్టుతో మ్యాచ్‌ కోసం టీమిండియా అభిమానులే కాదు.. యావత్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక అదిరిపోయే ప్లాన్ వేశాడు. ప్రస్తుతం దాని గురించే చర్చ నడుస్తోంది.

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగారు. ఈ జోడీ ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయాలనే డిమాండ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కాకముందు నుంచి ఉంది. అయితే.. రోహిత్‌ శర్మతో కలిసి రెగ్యులర్‌ ఓపెనర్‌గా ఉన్న యశస్వి జైస్వాల్‌ సరైన ఫామ్‌లో లేకపోవడం, అలాగే మరో ఓపెనింగ్‌ ప్రత్యామ్నయంగా ఎంపికైన సంజు శాంసన్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్‌ మ్యాచ్‌లో విఫలం కావడంతో.. రోహిత్‌ శర్మ.. విరాట్‌ కోహ్లీ వైపు మొగ్గుచూపాడు. అయితే.. ఐర్లాండ్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ సైతం ఫెయిల్‌ అయ్యాడు. 5 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి.. పెవిలియన్‌ చేరాడు. అయినా కూడా ఇదే కరెక్ట్‌ అంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

ఐపీఎల్‌ 2024లో ఓపెనర్‌గా కోహ్లీ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. అదే రేంజ్‌లో వరల్డ్‌ కప్‌లో కూడా ఆడాలని రోహిత్‌ ఆశిస్తున్నాడు. అందుకే కోహ్లీని ఓపెనర్‌గా బరిలోకి దింపాడు. పైగా కోహ్లీ ఓపెనర్‌గా రావడం వల్ల.. టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌నే తీసుకుంటే.. హార్ధిక్‌ పాండ్యా, జడేజాతో పాటు శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ ఇలా ఏకంగా నలుగురు ఆల్‌రౌండర్లకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది. కోహ్లీ ఓపెనర్‌గా రాకుండా ఉండి ఉంటే.. జైస్వాల్‌, సంజు శాంసన్‌లలో ఒకరు ఆడాల్సి వచ్చేది. అప్పుడు ఒక ఆల్‌రౌండర్‌ బెంచ్‌కే పరిమితం అయ్యేవాడు. అదనపు ఆల్‌రౌండర్‌ టీమ్‌లో ఉంటే బ్యాటింగ్‌ డెప్త్‌తో పాటు బౌలింగ్‌లో కూడా చాలా ఆప్షన్స్‌ ఉంటాయి. ఎలాగో కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఐర్లాండ్‌తో ఒక్క మ్యాచ్‌లో విఫలం అయినంత మాత్రనా.. కోహ్లీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. రోహిత్‌ సైతం.. ఇదే టీమ్‌ను పాకిస్థాన్‌పై కూడా కొనసాగిస్తామని ఇప్పటికే ప్రకటించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి